రాజమౌళి..... ఈయన గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.ఈయన ఒక సాదాసీదా డైరెక్టర్గా బుల్లితెరపై కెరీర్ ప్రారంభించి చూస్తూ చూస్తుండగానే ఏకంగా భారతదేశం మొత్తం గర్వించదగ్గ దర్శకుడిగా మారిపోయాడు.అయితే ఇప్పుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమా లో భారతీయ చలన చిత్ర పరిశ్రమ స్థాయిని మరింత పెంచుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.కాగా బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.ఇకపోతే రాజమౌళి తెరకెక్కించిన ప్రతి సినిమా సూపర్హిట్ అవుతుందన్న నమ్మకం ప్రేక్షకులు అందరి లో వచ్చేసింది.తాజాగా ఇప్పుడు త్రిబుల్ ఆర్ సినిమాతో మరోసారి తన సత్తా ఏంటో చూపించాడు దర్శకుడు రాజమౌళి.
ఇకపోతే త్రిబుల్ ఆర్ సినిమా పై ఎంతో క్యూరియాసిటీ తో ఉన్న ప్రేక్షకులు మొదటిరోజు మిస్ అయితే తర్వాత రోజైన ఎలాగైనా సినిమా చూడాలని అనుకుంటున్నారు. అయితే భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఉన్న హీరోలు అందరూ కూడా ఒక్కసారి రాజమౌళి సినిమాలో నటించే అవకాశం వస్తే ఎంత బాగుండు అని అనుకుంటూ ఉంటారు.కాగా దర్శకుడిగా రాజమౌళికి ప్రస్థానం గురించి అందరికీ తెలిసిన విషయమే.అయితే నటుడిగా తాను నటించిన సినిమాల్లోనే అప్పుడప్పుడు గెస్ట్ రోల్స్ చేస్తూ ఉంటాడు. ఇకపోతే దర్శక ధీరుడు రాజమౌళి ఓ సినిమాలో బాలనటుడిగా వెండితెరపై కనిపించాడన్నా విషయం చాలా తక్కువ మందికి తెలుసు.
ఇటీవలే తాజాగా త్రిబుల్ ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా ఇక ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు రాజమౌళి.అయితే 1983 లో తెరకెక్కిన పిల్లనగోవి అనే సినిమాలో బాలనటుడిగా కనిపించాడట రాజమౌళి.ఇకపోతే అప్పుడు రాజమౌళి వయసు 10 సంవత్సరాలు అవుతుంది. ఇక ఇక్కడ బాడ్ లక్ ఏమిటంటే రాజమౌళి నటించిన సినిమా ఇప్పటికీ కూడా విడుదలకు నోచుకోలేదు. అయితే కానీ రాజమౌళి బాల నటుడిగా ఓ సినిమాలో నటించిన సీక్రెట్ మాత్రం చివరికి బయటకు వచ్చింది. కాగా ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళి ఎన్టీఆర్ మధ్య చిన్న సరదా డిస్కషన్ వచ్చిన సమయంలోఇక ఈ విషయాన్ని బయట పెట్టాడు...!!