ఎంగేజ్మెంట్, బ్రేకప్ గురించి మొదటిసారి నోరు విప్పిన రష్మిక..?

Anilkumar
చలో సినిమాతో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ రష్మిక మందన.. ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో గీతా గోవిందం సినిమాలో నటించి ఆడియన్స్ కి మరింత దగ్గరయింది. గీత గోవిందం సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో రష్మిక మందనకి తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి. ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించి భారీ విజయాన్ని అందుకుంది.అక్కడితో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది రష్మిక. ఇక ఇటీవల ఐకాన్ స్టార్ సరసన పుష్ప చిత్రంతో హిట్ కొట్టి పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే తాజాగా ఆడాళ్ళు మీకు జోహార్లు అనే చిత్రంతో ఆడియన్స్ ని పలకరించింది.

అయితే ఈ సినిమా ఆమెకు నిరాశనే మిగిల్చింది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తోంది. ఇక రష్మిక మందన సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈమె యూట్యూబ్ లో అడుగు పెట్టింది. నిజానికి రెండు ఏళ్ళ కిందటే రష్మిక మందన అనే పేరుతో తన ఛానల్ క్రియేట్ చేసినా.. పెద్దగా ఆక్టివ్ కాలేదు. కాని గత కొద్ది రోజులుగా ఎంత యాక్టివ్ గా ఉంటుంది. ఈ సందర్భంగా తాజాగా రష్మిక నెటిజెన్స్ తో లైవ్ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ నుంచి ఆమెకు రకరకాల ప్రశ్నలు ఎదురయ్యాయి. వాటన్నింటికీ కూడా బదులిచ్చింది రష్మిక.

అయితే ఈ క్రమంలో తన ఎంగేజ్మెంట్ మరియు బ్రేక్ అప్ గురించి ప్రశ్నలు వేశాడు ఓ నెటిజన్.' మీ ఎక్స్ లవ్ ఎంగేజ్మెంట్ బ్రేకప్ తెలుసుకోవాలని ఉంది 'అంటూ అడిగిన ప్రశ్నకు రష్మిక ఎలాంటి బదులివ్వలేదు. మౌనంగా ఉండిపోయింది. దీంతో అసలు ఎందుకు రష్మిక నిశ్చితార్థం క్యాన్సిల్ అయింది అనే విషయం పై అంతటా ఆసక్తి నెలకొంది. అటు మరోవైపు రౌడీ విజయ్ దేవరకొండ డేటింగ్లో ఉన్నట్లు కూడా ఎప్పటినుంచో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై కూడా క్లారిటీ ఇవ్వలేదు రష్మిక మందన. ఇక 2018లో కన్నడ హీరోయిన్ రక్షిత్ తో రష్మిక కి నిశ్చితార్థం అయ్యింది. ఆ తర్వాత తెలుగులో ఆమె నటించిన గీత గోవిందం సినిమా అనంతరం రక్షిత్ తో ఎంగేజ్మెంట్ ను బ్రేక్ చేసుకుంది. అప్పట్లో కన్నడ ఇండస్ట్రీ తో పాటు తెలుగు ఇండస్ట్రీలో కూడా ఈ వార్త హాట్ టాపిక్ గా నిలిచింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: