నందమూరి బాలకృష్ణ తెలుగు సినీ ఇండస్ట్రీలో అనేకమైన విజయాలను సొంతం చేసుకున్నాడు ఆయన నటించిన సినిమాలు దాదాపుగా అన్ని సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ హిట్ లు అందుకోవడం జరిగింది. అన్ని సినిమాలు మంచి విజయాలను అందుకున్న అప్పటికీ ఆయన నటించిన చెన్నకేశవరెడ్డి సినిమా మాత్రం యావరేజ్ గా ఆడింది ఇక ఆ సినిమాపైనే నందమూరి బాలకృష్ణ అభిమానులు.ఇక ఆ రేంజ్ ఎలివేషన్స్ కలిగిన మూవీ.. ఆ స్థాయిలో బాలయ్య ఇచ్చిన పెర్ఫార్మన్స్ మళ్ళీ ఇప్పటివరకు చూడనట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇక ఇదిలా ఉంటె దర్శకుడు వి.వి.వినాయక్ ను కూడా ఇలాంటి సినిమా, కుదిరితే ఆ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేయాలంటూ బాలయ్య అభిమానులు కోరుతుంటారు.
ఇక అది ఎప్పటికి నెరవేరుతుందో తెలీదు. కానీ ప్రస్తుతం బాలయ్య.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న 107 వ సినిమా ఆ స్థాయిలోనే ఉండబోతుందని ఇన్సైడ్ టాక్ అన్నమాట.అయితే ఇందులో కూడా బాలయ్య అభిమానులకి కావాల్సిన హై రేంజ్ ఎలివేషన్స్ ఉంటాయట.అంతేకాదు ముఖ్యంగా చెల్లెలి పాత్ర కూడా ఓ రేంజ్లో ఉంటుందని వినికిడి.ఇకపోతే ఈ పాత్రకి తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ను ఎంపిక చేసుకున్నారని సమాచారం. అయితే 'చెన్నకేశవ రెడ్డి' లోని చెల్లెలి పాత్రని దేవయాని పోషించింది.అయితే ఆమె ఆ పాత్రకి బాగానే న్యాయం చేసింది.
అయినప్పటికీ అలాంటి పాత్ర వరలక్ష్మీ శరత్ కుమార్ కనుక చేస్తే.. అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కాగా అందుకే ఏరి కోరి ఆమెని ఈ ప్రాజెక్టులో ఎంపిక చేసుకున్నట్టు స్పష్టమవుతుంది. ఇకపోతే ఆమె పాత్రకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రేపు విడుదల చేయబోతున్నారట.ఇకపోతే అది నిజమో కాదో రేపు తెలుస్తుంది. కాగా 'మైత్రి మూవీ మేకర్స్' వారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే చాలా కాలం తర్వాత బాలయ్య పక్కన నటిస్తున్న స్టార్ హీరోయిన్ ఈమెనే కావడం మరో విశేషం...!!