బాలీవుడ్ హీరోయిన్ తో ప్రేమలో పడ్డ సందీప్ కిషన్..?

Anilkumar
టాలీవుడ్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో సందీప్ కిషన్ కూడా ఒకడు. తక్కువ సినిమాలతోనే ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు సందీప్ కిషన్. ఒకవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు సొంతంగా నిర్మాణ సంస్థను స్థాపించి అందులో పలు మీడియం బడ్జెట్ సినిమాలను నిర్మిస్తూ తన నిర్మాణ సంస్థలో న్యూ టాలెంట్ ని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే సందీప్ కిషన్  తాజాగా ప్రేమలో పడ్డట్టు...సోషల్ మీడియాలో వార్తలు ఇప్పుడు హల్చల్ గా మారాయి. అయితే ప్రస్తుతం ఉన్న డిజైన్లు సందీప్కిషన్ నిజంగానే ప్రేమలో పడ్డాడా ...ప్రేమలో పడితే ఆ అమ్మాయి ఎవరు? అంటూ ఆలోచనలు చేస్తున్నారు.

ఇకపోతే ఆ బ్యూటీ ఎవరంటే బాలీవుడ్ నటి సోనియా రథీ.అయితే ఈమె మాధవన్‌తో కలిసి డీకపుల్డ్ సినిమాతోపాటు బ్రోకెన్ బట్ బ్యూటీఫుల్ 3 సినిమాల్లో నటించింది.ఇకపోతే  ప్రస్తుతం హిందీ చిత్రం తారా వర్సెస్ బిలాల్ లో నటిస్తోంది.సోనియా రథీ ప్రొడక్షన్ డిజైనర్‌గా కూడా పనిచేసింది.  అంతేకాదు ఈమె నటన తో పాటు డాన్స్ కూడా ఇరగదీసేస్తుంది. ఇకపోతే సందీప్ కిషన్ హైదరాబాదులో కంటే ముంబైలో ఎక్కువగా ఉంటాడన్న విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలను చూస్తే ...ఈ విషయం నిజమే అని అంటున్నారు అందరూ.

అంతేకాకుండా కొంతమంది సందీప్ కిషన్ ముంబయిని రెండో ఇల్లు గా చేసుకున్నాడు అని అంటున్నారు.అయితే ఈమె యూఎస్ సిటిజన్ (హర్యానా వాసి) అయిన సోనియాతో డేటింగ్‌లో ఉన్నారనడానికి ఇవే కారణమని నెటిజన్లు అంటున్నారు.ఇకపోతే సందీప్ కిషన్ ప్రస్తుతం విజయ్ సేతుపతితో కలిసి మైఖేల్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది.అయితే  మొత్తానికి హ్యాపీమూడ్‌లో నెటిజన్ల కంట పడుతున్న సందీప్ కిషన్‌-సోనియా రాబోయే రోజుల్లో ఏదైనా గుడ్ న్యూస్ చెప్తారేమో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: