తెలుగు సినిమా ఇండస్ట్రీలో కి బాణం మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నారా రోహిత్.. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ తన కెరియర్ను ప్రారంభించాడు. ఎన్నో సినిమాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను బాగా గుర్తుండేలా చేశాడు నారా రోహిత్. నారా రోహిత్ కెరియర్లో సోలో, శమంతకమణి, అప్పట్లో ఒకడుండేవాడు, ప్రతినిధి తదితర సినిమాలు కూడా ఈ హీరోకి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చాయి.
ఇక అంతే కాకుండా వీర భోగ వసంత రాయ, ఆటగాళ్లు, బాలకృష్ణుడు వంటి సినిమాలు వరుసగా డిజాస్టర్ కావడంతో దీంతో కాస్త విరామం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం నాలుగు సినిమాలను లైన్లో పెట్టారనే వార్త బాగా వినిపిస్తోంది.. కానీ ప్రస్తుతం వాటికి సంబంధించి ఏ విధంగా కూడా అప్డేట్ రాలేదు. ఇక అంతే కాకుండా ఇటీవల కాలంలో ఈ హీరో బయట కూడా పెద్దగా కనిపించలేదు.. అయితే ఇప్పుడు మాత్రం ఒక షాకింగ్ లుక్ తో కనిపించి అందరినీ ఆశ్చర్య పరిచేలా చేశాడు. హైదరాబాదులో తాజాగా ఒక సంస్థ ప్రారంభోత్సవానికి నారా రోహిత్ హాజరు కావడం జరిగింది.. ఈ కార్యక్రమంలో నారా రోహిత్ స్నేహితుడు శ్రీవిష్ణు కూడా పాల్గొనడం జరిగింది. అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి.
ఇందులో రోహిత్ చూస్తే జుట్టు బాగా పెంచేసి.. గడ్డానికి కూడా గుబురుగా పెంచి కనిపిస్తున్నారు. కాస్త బొద్దుగా కూడా మారినట్లు కనిపిస్తున్నాడు నారా రోహిత్.. ఇక హీరోగానే కాకుండా నార్మల్ లైఫ్ కి అలవాటు పడిపోయిన వ్యక్తి గా కనిపిస్తున్నాడు రోహిత్. ఈ ఫోటోను చూసిన ఆయన అభిమానులు గుర్తు పట్టడం చాలా కష్టం గా మారిపోయింది.. లేకపోతే ఏదైనా సినిమా కోసం ఇలా రెడీ అవుతున్నారా అన్నట్లుగానే.. ఆయన అభిమానులు ఆలోచిస్తూ ఉంటారు. ఏదైనా ఒక సినిమా సక్సెస్ అయితే చాలు నారారోహిత్ కెరియర్ మళ్లీ గాడిలో పడుతుందని చెప్పవచ్చు.