బిగ్ బాస్ ఓటీటీ న్యూ హోస్ట్ గా ప్రముఖ యాంకర్..?

Anilkumar
'బిగ్ బాస్ నాన్ స్టాప్' ఆరో సీజన్ కోసం టీవీ ఆడియెన్స్  ఎంతగా ఎదురుచూస్తున్నారో  చెప్పాల్సిన అవసరం లేదు.ఇక  ఈ సారి హౌజ్ లుక్ కూడా చాలా గ్రాండ్ గా కనిపించనుంది.ఇప్పటికే ఫైనల్ లిస్ట్ జాబితా నెట్టింట చక్కర్లు  కొడుతోంది.కాగా ఈ నెల  26 నుంచి షో స్ట్రీమింగ్ షురూ కానుంది.ఇక ఆరో సీజన్‌ కూడా త్వరగానే ప్రారంభమవుతుందని నాగార్జున  గ్రాండ్‌ ఫినాలే రోజునే చెప్పారు.అయితే మొత్తం 19 మంది కాంటెస్టెంట్ల పేర్లు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ ఫైనల్ లిస్ట్ జాబితా  నెట్టింట చక్కర్లు కొడుతోంది.అంతేకాకుండా గత ఐదు సీజన్ల నుంచి ఇద్దరిని చొప్పున ఈ ఆరో సీజన్‌కి ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

ఇక వారెవరంటే అరియానా, ముమైత్‌ ఖాన్‌, ఆషురెడ్డి, అఖిల్‌, హమీద, సరయు, ధన్‌రాజ్‌, తనీష్‌, మహేష్‌విట్టా, ఆదర్శ్‌, నటరాజ్‌ మాస్టర్‌ గత సీజన్లలో పాల్గొన్న వారే కావడం విశేషం.   కాగా అసలు విషయం ఏమిటంటే బిగ్ బాస్ తెలుగు ఓటీటీ న్యూ హోస్ట్ గా యాంకర్ రవి  పేరు నెట్టింట గట్టిగా వినిపిస్తోంది. కాగా శ్రీరామచంద్ర, యాంకర్ రవి పేర్లను బిగ్ బాస్ పరశీలించినట్టు తెలుస్తోంది.కాగా ఇప్పటికే శ్రీరామ చంద్ర ఆహాలో ప్రసారం కానున్న 'తెలుగు ఇండియన్ ఐడల్' సింగింగ్ రియాలిటీ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.అయితే ఈ క్రమంలో ఇక యాంకర్ రవినే సెలెక్ట్ చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

అంతేకాదు లాంచింగ్ రోజునైనా నాగార్జున వస్తారా లేక... మొదటి వారం ఆయనే హోస్ట్ గా ఉండి తర్వాత యాంకర్ రవికి ఆ తర్వాత బాధ్యతలు అప్పగిస్తారా అన్నది వేచి చూడాలి. అయితే తమిళంలో కొనసాగుతున్న బిగ్ బాస్  కు హోస్ట్ గా వ్యవహరించిన కమల హాసన్ ఓటీటీ వేదికన ప్రసారమవుతున్న షోకు తప్పుకున్నారు.కాగా హిందీ ఓటీటీలోనూ కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: