బ్రిటీష్ హీరోతో ప్రేమలో పడ్డ రామ్ చరణ్ హీరోయిన్..?

Anilkumar
బ్రిటిష్ నటి అమీ జాక్సన్ ఎవడు సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన నటించిన అమీ జాక్సన్ ఇక ఎవడు సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తమిళంలో ధనుష్ కి జోడీగా నవ మన్మధుడు’ సినిమాల్లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది ఇక ఆ తర్వాత ఏకంగా తమిళ స్టార్ హీరో విక్రమ్ నటించిన ఐ ఐ సినిమాలో హీరోయిన్ గా నటించి సౌత్ లో మంచి పాపులారిటీని సంపాదించుకుంది.ఇక ఆ తర్వాత రజినీకాంత్  2.0 లో నటించింది.

ఇక తర్వాత ఆమె ఇండియన్ సినిమాలు చేయడం మానేసి యూకే వెళ్లిపోవడం జరిగింది. సినిమాల విషయం పక్కనపెడితే ఇక ఈ బార్బీ బొమ్మ వ్యక్తిగత జీవితంతో కూడా ఎప్పుడూ వార్తల్లోనే నిలుస్తూ ఉంటుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ బ్యూటీ ఓ బ్రిటిష్ యాక్టర్ తో డేటింగ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకుముందు  ఆమె జార్జ్ పనాయోటౌ అనే వ్యక్తితో డేటింగ్ చేసింది. అంతేకాదు వారిద్దరు నిశ్చితార్థం కూడా చేసుకోవడం జరిగింది. నిశ్చితార్థ మే కాకుండా వీరిద్దరికీ కొడుకు కూడా ఉన్నాడు. ఇక తర్వాత వారి కొడుకు పుట్టిన తరువాత ఈ దంపతుల మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు.

ఇక  అప్పటి నుంచి అమీ ఒంటరిగానే ఉంటోంది. అయితే ఇప్పుడు అమీ జాక్సన్ మరోసారి ప్రేమలో పడింది. తాజాగా అమీ బ్రిటిష్ నటుడు ఎడ్ వెస్ట్‌విక్‌తో డేటింగ్ చేస్తోంది. ఇక వీరిద్దరూ ఇప్పటి వరకు  ఈ వార్తలపై స్పందించలేదు. తాజాగా వెస్ట్‌విక్ వెబ్ సిరీస్ ‘గాసిప్ గర్ల్‌’లో నటించి పాపులర్ అయ్యాడు. అంతేకాదు వెస్ట్‌విక్, అమీ త్వరలో వారి సంబంధాన్ని అధికారికంగా తెలియజేయవచ్చని వినికిడి. అయితే అమీ సినిమాలు చేయడం మానేసినా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. తాజాగా ఆమె హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో రచ్చ చేశాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: