టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్, అనుష్కల జోడి కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిల్లా, మిర్చి, బాహుబలి సినిమాలతో టాలీవుడ్ లోనే ది బెస్ట్ ఆన్ స్క్రీన్ జోడి గా పేరు తెచ్చుకున్నారు ప్రభాస్, అనుష్క. అంతేకాదు వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి వీరు నిజజీవితంలో కూడా జంటగా మారబోతున్నారని అప్పట్లో ఎన్నో రకాల కథనాలు వినిపించాయి. ఇక వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలని అభిమానులు కూడా తెగ ముచ్చట పడ్డారు. కానీ ప్రభాస్, అనుష్క ఇద్దరూ తాము పెళ్లి చేసుకోవడం లేదని, ఎప్పుడూ మంచి స్నేహితులం మాత్రమేనని చెప్పడం జరిగింది.
ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ సినిమా నుంచి వచ్చిన ప్రతి అవకాశానికి గ్రీన్ సిగ్నలిచ్చిన అనుష్క ఒకే ఒక సినిమాను మాత్రం రిజెక్ట్ చేసిందట. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఇంతకీ ఆ సినిమా ఎంటనేగా మీ సందేహం..? అక్కడికే వస్తున్నా.. ఆ సినిమా మరేదో కాదు రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన 'రెబల్'. 2012 వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా తమన్నా, దీక్షాసేథ్ హీరోయిన్స్ గా నటించగా.. సీనియర్ హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు మరో కీలక పాత్ర పోషించారు. అయితే ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా అనుష్క ని సంప్రదించారట మేకర్స్.
కానీ అనుష్క అదే సమయంలో ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల రెబల్ సినిమాని రిజెక్ట్ చేసిందట. దాంతో అనుష్క నో చెప్పడంతో ఆమె ప్లేస్ లో తమన్నాను హీరోయిన్గా తీసుకున్నారట. ఇక భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ టాక్ ను మూటగట్టుకుంది. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ ని మాత్రం ఈ సినిమా సంతృప్తి పరిచిందనే చెప్పాలి. రాఘవ లారెన్స్ ఈ సినిమాలో ప్రభాస్ ని సరికొత్తగా ప్రజెంట్ చేశారు. ముఖ్యంగా సినిమాలో హీరోయిజాన్ని ఎలివేట్ సీన్స్ అయితే ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాయనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్, సలార్, ఆదుపురుష్, ప్రాజెక్ట్ కె వంటి సినిమాల్లో నటిస్తున్నారు. వీటిలో రాధే శ్యామ్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది...!!