
స్టేజ్ పైనే బిగ్ బాస్ కంటెస్టెంట్ కి ఐ లవ్ యు చెప్పిన ఆలియాభట్..!!
ఇకపోతే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ గ్రాండ్ ఫినాలే స్టార్ మా లో ప్రసారం అవుతోంది కాబట్టి ఈ షోకి ఎంతో మంది స్టార్ సెలబ్రిటీలు అతిథులుగా హాజరయ్యారు. నాచురల్ స్టార్ నాని తన శ్యామ్ సింగరాయ్ టీంతో కలిసి హాజరయ్యారు. ఇక అందులో భాగంగానే కృతి శెట్టి, సాయిపల్లవి కూడా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకి హాజరవడం జరిగింది. ఇక రణ్ బీర్ కపూర్ , ఆలియా భట్ ఇద్దరూ గ్రాండ్ ఫినాలే స్టేజిపై జంటగా వచ్చి అందరినీ అలరించారు. ఇకపోతే ఈ గ్రాండ్ ఫినాలే స్టేజ్ పైన ఆలియా భట్ బిగ్ బాస్ కంటెస్టెంట్ కి ఐ లవ్ యు చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
చివరగా మిగిలిన ఐదు మంది కంటెస్టెంట్ లను చూసి రణ్ బీర్ కపూర్ తెలుగు లో మీ అందరికీ నా ముద్దులు అని చెప్పగా.. ఈయన తెలుగులో మాట్లాడటం చూసి అందరు హర్షం వ్యక్తం చేశారు. స్టేజ్ పైన ఆలియా కనిపించగానే సన్నీ ఒక్కసారిగా గట్టిగా ఆలియా అని సంతోషంగా అరవడంతో.. అప్పుడు అలియా తన అందమైన కళ్ళతో సన్నీని చూస్తూ. సన్నీ ఐ లవ్ యు అని చెప్పేస్తుంది.. ఇక ఈ మాట వినగానే సన్నీ ఒక్కసారిగా నేలకొరుగుతాడు. నాగార్జున వెంటనే అయిపోయాడు అనగానే అందరు గట్టిగా నవ్వుతారు.ప్రస్తుతం ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.