టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ రేంజ్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు ప్రభాస్. ఇక ఇప్పటికే నాలుగు పదుల వయసు వచ్చినప్పటికీ ప్రభాస్ మాత్రం తన పెళ్లి ఊసే ఎత్తడం లేదు. సుమారు పది సంవత్సరాల నుంచి ప్రభాస్ పెళ్లికి సంబంధించిన వార్తలు వచ్చినా.. వాటిల్లో ఎటువంటి వాస్తవం లేదు. ఫ్యాన్స్ తోపాటు, సినీ సెలబ్రిటీలు కూడా ప్రభాస్ పెళ్లి కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఎన్నాళ్లైనా ఆ శుభవార్త మాత్రం రానేలేదు. అయితే ఇన్ని రోజుల వరకు ప్రభాస్ పెళ్లి చేసుకోవడానికి కారణం ఆయన నటిస్తున్న సినిమాలు అని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు అది కాకుండా తెర పైకి మరో ప్రచారం వెలుగులోకి వచ్చింది.
దాని ప్రకారం.. ప్రభాస్ క్షత్రియ కులానికి చెందినవాడు అన్న విషయం అందరికి తెలిసిందే. కాబట్టి ప్రభాస్ క్షత్రియ కులానికి సంబంధించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ప్రభాస్ కుటుంబ సభ్యులకి వారి కులస్తుల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తుందట. ఈ నేపథ్యంలో లోనే ప్రభాస్ పెళ్లి కోసం తమ కులానికి చెందిన అమ్మాయిని వెతికుతున్నప్పటికీ ప్రభాస్ కు నచ్చిన అమ్మాయి మాత్రం ఇప్పటివరకు దొరకడం లేదట. ఈ కారణం వల్లనే ప్రభాస్ పెళ్లి ఇప్పటివరకు ఆలస్యం అవుతూ వస్తోంది అని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ప్రస్తుతం తెరపై ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఈ వార్త మాత్రం ఎంతో వైరల్ గా మారుతోంది.
మరి ప్రభాస్ కు నచ్చిన అమ్మాయి ఎప్పుడు దొరుకుతుందో? తన పెళ్లి వార్తను ప్రభాస్ తన అభిమానులకు ఎప్పుడు చెప్తాడో అనేది అందరిలో చర్చనీయాంశంగా మారింది. ఇక ప్రభాస్ సినిమా విషయానికొస్తే.. ప్రస్తుతం తాను నటించిన రాధేశ్యామ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు ముస్తాబవుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. రాధా కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది.ఇక ఈ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్,ఓం రావుత్ తో అది పురుష్,నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కె వంటి సినిమాల్లో నటిస్తున్నాడు...!!