థమన్ అన్ని కోట్ల పారితోషకం డిమాండ్ చేసేది అందుకేనా..?

Anilkumar
టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ తమన్ మ్యూజిక్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. పెద్ద పెద్ద సినిమాల కి ఈయన మ్యూజిక్ అందిస్తారు అన్న విషయం తెలిసిందే. ఒక సినిమాకి చాలా మంది టెక్నీషియన్లు భారీగానే పారితోషికం తీసుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.ఈ జాబితాలో థమన్ కూడా ఒకడు. అయితే తమను ఒక సినిమాలో మ్యూజిక్ను అందించడానికి కోట్ల పారితోషికం పుచ్చుకుంటారు అని ప్రచారం ఎప్పటినుంచో జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో వస్తున్న వార్తల ప్రకారం అయితే ఏ సినిమాకైనా అంటే చిన్న సినిమా నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వరకు ఎవరైనా సరే అందరి నుం డి 2.5 కోట్ల నుంచి 3.5 కోట్ల వరకు తీసుకుంటారని తెలుస్తోంది.

 ఇకపోతే తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఏ రేంజిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల వైకుంఠపురంలో, వకీల్‌సాబ్‌, క్రాక్ సినిమాలలో ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి చెప్పనవసరం లేదు. నేను అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు ఏమి ఫుల్స్ కాదు... నేను అందించే మ్యూజిక్ కు ఏ రేంజ్ లో డబ్బు పలికితే అదే రేంజ్ లో నిర్మాతలు ఇస్తారు. అంతేకాదు నా మ్యూజిక్ కు ఎంత డబ్బు ఇవ్వాలో నిర్మాతలకు తెలుసు అంటూ చెప్పారు తమన్. నా మ్యూజిక్ డిమాండ్కు సరిపోయేంత డబ్బు ఇస్తారని వెల్లడించారు. అయితే తమను ఒక సినిమాకు మ్యూజిక్ అందిస్తే అందులో వచ్చే పారితోషికం తనొక్కడే తీసుకోడు.

వచ్చే మొత్తం పారితోషికంలో 50 శాతం తను మిగిలిన 50 శాతం సౌండ్ ఇంజినీర్లు,  ప్రొఫెషనల్ మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్ ప్లేయర్స్ తో పాటు పాపులర్ మిక్స్ ఇంజినీర్ షాదాబ్ రయీన్‌, పాపులర్ సింగర్స్, చాలా మందికి చెల్లిస్తాడు థమన్‌. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస ఆఫర్లతో బిజీ గా మారాడు తమన్. ఇక తాజాగా థమన్ సంగీతం అందించిన అఖండ సినిమా త్వరలోనే విడుదల కానుంది ఇక ఈ సినిమాతో పాటు భీమ్లా నాయక్, సర్కార్ వారి పాట సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్నాడు. అందులో భీమ్లా నాయక్ పాటలు ఇప్పటికే విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: