అక్కడ కూడా హిట్టు కొట్టిన అఖిల్..!!

Anilkumar
అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'. అఖిల్ సరసన పూజా హెగ్డే  హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఇటీవల దసరా కానుకగా థియేటర్ లో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నివాసు, వాసు వర్మ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక విడుదలైన తర్వాత ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. మరోవైపు అఖిల్ కెరీర్లోనే ఈ సినిమా భారీ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. చాలా కాలం తర్వాత అఖిల్ ఈ సినిమాతో మొదటి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

 ఇక ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ఓటీటీ వేదిక అయిన 'ఆహా' లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ సినిమాని ఓటిటిలో విడుదల చేసే ముందు ఆహా నిర్వాహకులు భారీ స్థాయిలో ప్రమోట్ చేశారు. అయితే ఓటిటిలో కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సూపర్ హిట్ అనిపించుకుంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ఆహా ఓటీటీ లో కేవలం రెండు రోజుల్లోనే ఏకంగా 100 మిలియన్ల నిమిషాల రన్ టైం ను సొంతం చేసుకుంది. ఇక థియేటర్లలో ఈ సినిమాని మిస్ అయిన ఆడియన్స్ ఓటిటిలో చూడటంతో ఈ సినిమాకు రికార్డు స్థాయిలో వ్యూస్ దక్కాయి. దీంతో అఖిల్ కెరీర్ లో మొట్టమొదటి బ్లాక్బస్టర్ చిత్రంగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నిలిచింది.

 ఇక చాలా కాలం తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాతో భారీ సక్సెస్ను సాధించి మరోసారి తన సత్తా చూపించారు. ఇక ఈ సినిమా సక్సెస్ తో ఫుల్ హ్యాపీ అయిన అఖిల్ తన తర్వాతి సినిమాల విషయంలో మాత్రం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్' అనే సినిమాలో నటిస్తున్నాడు అఖిల్. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా కోసం అఖిల్ తన మేకోవర్ ని పూర్తిగా మార్చుకున్నాడు. అంతే కాదు అఖిల్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతుంది. ఇక వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమా తో అఖిల్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: