ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న 'పుష్ప' సినిమాలో ఐటెం సాంగ్ కి స్టార్ హీరోయిన్ సమంత గ్రీన్సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ స్పెషల్ సాంగ్ కోసం సమంత భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకోనున్నట్లు కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక నాగ చైతన్యతో విడాకుల ప్రకటన అనంతరం సమంత స్పెషల్ సాంగ్ కి ఓకే చెప్పడం సోషల్ మీడియా వేదికగా అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఈ స్పెషల్ సాంగ్ విషయంలో దర్శకుడు సుకుమార్ కి సమంత కొన్ని కండిషన్లు పెట్టినట్లు సమాచారం వినిపిస్తోంది. ఇక ఈ స్పెషల్ సాంగ్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తో అదిరిపోయే ట్యూన్ రెడీ చేశారట.
అయితే ఈ స్పెషల్ సాంగ్ ని మొదట హైదరాబాదులో ఉండే ఓ ప్రముఖ స్టూడియోలో షూటింగ్ చేయాలని భావించగా.. అందుకు సమంత మాత్రం ఈ సాంగ్ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీకి మార్చాలని సుకుమార్ ని కోరినట్లు తెలుస్తోంది. అంతే కాదు ఈ స్పెషల్ సాంగ్ కోసం వేసిన సెట్స్ గాని ఫోటోలు కానీ బయట ఎక్కడా కూడా లీక్ కాకుండా చూడమని సమంత సుకుమార్ ను కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సమంత మాత్రం మీడియా నుంచి అభిమానుల నుంచి తనకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని భావించే సుకుమార్ కి ఈ కండిషన్స్ పెట్టినట్లు చెబుతున్నారు. ఇక ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్ కోసం సమంత ఐదురోజుల డేట్స్ ని కేటాయించినట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాకి సంగీతం అందిస్తున్న దేవిశ్రీ ప్రసాద్ ఈ స్పెషల్ సాంగ్ కోసం ఇప్పటికే ఒక ప్రత్యేకమైన బీట్ ను సిద్ధం చేశారని సమాచారం వినిపిస్తోంది. అయితే తనకు పూర్తి ప్రైవసీ కావాలని కోరుకుంటున్న సమంత ఈ సాంగ్ కోసం ప్రత్యేకమైన షరతులను విధించినట్లు తెలుస్తోంది. ఇక గతంలో కొంత మంది స్టార్ హీరోయిన్లు సైతం అగ్ర హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ తో మెప్పించారు. తమన్నా, కాజల్, పూజ హెగ్డే, అనుష్క ఈ కోవకు చెందినవారే. ఇప్పుడు ఆ లిస్టులో పుష్ప స్పెషల్ సాంగ్ తో సమంత కూడా చేరనుంది. మరి ఈ స్పెషల్ సాంగ్ తో సమంత ఆడియన్స్ ని ఎంతలా మెప్పిస్తుందో చూడాలి. ఇక movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఇందులో మొదటి భాగం డిసెంబర్ 17 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది...!!