బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో రూపొందిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 15 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. విడుదలైన మొదటి రోజే పాజిటివ్ టాక్ తో డీసెంట్ కలెక్షన్స్ ని అందుకున్న ఈ సినిమా ఫుల్ రన్లో యాభై కోట్ల క్లబ్లో కూడా చేరి అఖిల్ కెరీర్ లోనే ఫస్ట్ అండ్ బి గెస్ట్ గా నిలిచింది. అంతే కాదు అఖిల్ కెరీర్లోనే తొలి హిట్ మూవీ ఇదే కావడం విశేషం.
ఇక ఈ సినిమా సుమారు 20.9 వన్ కోట్ల బిజినెస్ చేయగా ఫుల్ రన్ లో ఈ సినిమా భారీ లాభాలతో ముగిసింది. ఇక ఇదిలా ఉంటే థియేటర్స్ లో ఈ సినిమాని మిస్సైన వారు ఈ సినిమా ఓ టి టి లో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఇప్పుడు అతి త్వరలోనే ఓటిటి లోకి వచ్చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం నవంబర్ 19 నుండి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా నెట్ ఫ్లిక్స్, ఆహా ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇక దీనికి సంబంధించి చిత్ర యూనిట్ మరో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. ఇక టాలీవుడ్ లో సుదీర్ఘ విరామం తర్వాత దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాను తెరకెక్కించాడు.
డిఫరెంట్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ని ఆకట్టుకుంది. సినిమాలో అఖిల్, పూజా హెగ్డే ల నటన, పాటలు, కామెడీ సీన్స్ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. ఇక ముఖ్యంగా ఈ సినిమాలో పాటలు రిలీజ్ కు ముందే సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ సినిమాలో సిద్ శ్రీరామ్ పాడిన లెహరాయి సాంగ్ అయితే యూట్యూబ్ లో భారీ న్యూస్ ని సాధించింది. ఇక ఈ సినిమాతో పాటు దసరా బరిలో మరి కొన్ని సినిమాలు విడుదల అవ్వగా.. వాటి తో పోటీలో నెగ్గి డీసెంట్ హిట్ ని అందుకుంది ఈ సినిమా. ఇక ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ లో మునిగితేలుతున్న అఖిల్ దీని తరువాత సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది...!!