బిగ్ బాస్ జెస్సీకి.. ఏం వ్యాధి వచ్చిందో తెలుసా?
ప్రస్తుతం జెర్సీ ఆరోగ్యం గురించి అందరూ చర్చించుకుంటున్నారు అని చెప్పాలి. అయితే ఇటీవలే అనారోగ్యం బారిన పడిన జెస్సీ టాస్క్ లో పాల్గొనడం మాట పక్కన పెడితే కనీసం గట్టిగా మాట్లాడేడానికి కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నాడు. అంతేకాదు కుదురుగా నడవలేకపోతున్నా డు. సరిగ్గా ఎవరిని చూడలేకపోతున్నాడు. అయితే వర్టిగో అనే సమస్యతో జెస్సి బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్నో రోజుల నుంచి తనకు వర్టిగో వుంది అన్న విషయాన్ని హౌస్లో పలుమార్లు ప్రస్తావించాడు జెస్సి. ఇక ఇటీవలే మరోసారి ఈ సమస్య ఎక్కువ అవడంతో తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు.
ఇక రోజురోజుకు అతనికి సమస్య ఇబ్బంది పెడుతూ ఉండటంతో అతన్ని హౌస్ నుండి బయటకు పంపించి సీక్రెట్ రూమ్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అయితే అసలు వర్టిగో అంటే ఏమిటి దీని వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి అనేది తెలుసుకుందాం. తరచూ తల తిరగడం.. విపరీతంగా వాంతులు కావడం.. సరిగా నడవలేకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయట. అంతేకాదు ఒక వైపు తిరిగి పడుకున్నప్పుడు తల మొత్తం తిరిగి పోతూ ఉండటం.. చెవిలో ఒక్కసారిగా హార్మోని శబ్దం లాంటి వినిపించడం.. కొద్దిసేపటి వరకు వినికిడి మందగించడం లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి అని.. వైద్యులు సూచించిన ఔషధాలతో పాటు తగిన వ్యాయామం చేయడం వల్ల కూడా వర్టిగో సమస్య అదుపులో ఉండే అవకాశం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.