సక్సస్ నిర్ణయంలో సాయి పల్లవి వైరాగ్యం !

Seetha Sailaja
‘ఫిదా’ ‘లవ్ స్టోరీ’ సినిమాలను చూసిన వారంతా సాయి పల్లవి గురించి మాత్రమే మాట్లాడుకోవడం జరిగింది. సాయి పల్లవి అద్భుతమైన బ్యూటీ కాదు కాని ఆమె నటనలో అదేవిధంగా ఆమె డాన్స్ లో ఎంతో ఈజ్ ఉండటంతో ఆమె ముందు అనేకమంది గ్లామర్ బ్యూటీలు నిలవలేక పోతున్నారు. ఆమెకు ఏర్పడ్డ క్రేజ్ తో అనేక అవకాశాలు వస్తున్నప్పటికీ సాయి పల్లవి చాల మంచి కథలను పాత్రలను ఎంచుకుంటూ చాల వ్యూహాత్త్మకంగా అడుగులు వేస్తోంది.

పుట్టపత్తి లోని భగవాన్ సత్యసాయి బాబా స్కూల్ లో చదువుకున్న సాయి పల్లవికి ఆధ్యాత్మిక ధోరణి కూడ చాల ఎక్కువ. అయితే ఆవేదాంత ధోరణిని తన కెరియర్ లో చూపించదు. ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి పల్లవి కరోనా పరిస్థితులలో ఎందరో చనిపోవడం చూసి తాను డాక్టర్ ను అయిఉండి కూడ ఏమి చేయలేకపోయాను అని బాధ పడిందట.

సాయి పల్లవి ఎమ్.బి.బిఎస్ చదివినప్పటికీ ఇంకా హౌసర్జన్ గా విధులు నిర్వర్తించక పోవడంతో ఆమె డాక్టర్ అయినప్పటికీ ప్రాక్టీస్ చేయడానికి అనర్హురాలు. వరసపెట్టి సినిమాలు చేస్తూ ఉండటంతో ఆమె తన సినిమా కెరియర్ పై పూర్తి దృష్టి పెట్టి తన చదువును పక్కకు పెట్టింది. అయితే కరోనా పరిస్థితులలో సరైన వైద్య సహాయం అందక అనేకమంది ప్రాణాలు కోల్పోవడం చూసి తాను చదువు పూర్తి చేయకుండా తనకు ఇష్టమైన సినిమా కెరియర్ లోకి వచ్చి తప్పు చేసానా అన్న ఫీలింగ్ కలిగి అనేకసార్లు తాను బాధపడ్డాను అని వివరించింది.

అయితే ఎప్పటికైనా తాను లైఫ్ లో డాక్టర్ గా సెటిల్ కావడం ఖాయం అని చెపుతూ తాను సినిమా నటిగా బాగానే సంపాదించాను కాబట్టి పేదలకు సేవ చేయడానికి ఒక హాస్పటల్ పెట్టి ఎంతోకొంత సేవ చేస్తాను అని అంటోంది. గ్లామర్ హీరోయిన్స్ అంతా తాము సంపాదించిన డబ్బును వ్యాపారాలలో రియలెస్టేట్ లో పెట్టి తమ డబ్బును పెంచుకుంటూ ఉంటే సాయి పల్లవి మాత్రం ఒక హాస్పటల్ పెడతాను అని చెప్పడం ఆమె సామాజిక బాధ్యతకు సంకేతం..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: