ఆ రోజు మధ్యాహ్నమే ఏపీ భవితవ్యం తేలనుందా....??

Suma Kallamadi
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసే ఇప్పటికే రెండు వారాలకు పైగా సమయం గడిచిపోయింది. ఇంకా సీఎం ఎవరు అనేది తెలియ రాలేదు. ఓట్ల లెక్కింపు రోజు కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ రోజుతో ఏపీ ప్రజల భవితవ్యం ఏంటో తెలిసిపోతుంది జగన్ వస్తే మరింత అభివృద్ధి చేస్తారు. చంద్రబాబు వస్తే ఏమవుతుందో, వారేం చేస్తారో వారికే తెలియాలి.
వాస్తవానికి మరో వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌కి కాబోయే ముఖ్యమంత్రి ఎవరో తేలిపోనుంది. జూన్ 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకల్లా జగన్ రెండోసారి సీఎం అవుతారా లేక ప్రజలు చంద్రబాబు నాయుడును మళ్లీ అధికారంలోకి తీసుకువస్తారా అనేది తేలిపోతుంది. 111 నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2 గంటలలోపు పూర్తవుతుందని ఏపీ ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తాజాగా ప్రకటించారు. ఈ నియోజకవర్గాల్లో 20 రౌండ్లలో ఈవీఎంల లెక్కింపు ఉంటుంది.మధ్యాహ్నం 2 గంటలకు, ఈ 111 నియోజకవర్గాల ఫలితాల ఆధారంగా ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే దానిపై పూర్తిగా క్లారిటీ వస్తుంది. ఈ సమయంలో ఆధిక్యంలో ఉన్న పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 88 సీట్ల మ్యాజిక్ నంబర్‌ను చేరుకోవడానికి మంచి అవకాశం ఉంది.
మరో 61 నియోజకవర్గాల్లో 21-24 రౌండ్ల కౌంటింగ్ ఉన్నందున సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్ పూర్తవుతుంది. మిగిలిన 3 నియోజకవర్గాల లెక్కింపు 25 రౌండ్లకు పైగా ఉంది, ఎక్కువ సమయం పడుతుంది. జూన్ 4వ తేదీ రాత్రి 8 లేదా 9 గంటలలోపు ఏపీ ఎన్నికల తుది ఫలితం వెలువడుతుందని సీఎం తెలిపారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమై, పోస్టల్ బ్యాలెట్‌లతో ప్రారంభమవుతుంది. అర్థగంటలోపే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరి వైపు ఉన్నారనేది కూడా తెలిసిపోతుంది. ఈసారి జగన్ వస్తే ప్రభుత్వం ఉద్యోగులను మరింత అనగదొక్కుతారని కొంతమంది అంటున్నారు. మరి వ్యతిరేకత చూసి వారికి మంచి చేస్తారో లేదంటే ఇంకా ఇబ్బందులు పెడతారో తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: