ఏపీలో ఎన్నడు లేని విధంగా టెన్షన్.. ఉద్యోగాలను వదిలేసే పరిస్థితి.. కారణమేంటి..?

lakhmi saranya
ఏపీలో ఎన్నికలు ముగిసి పది రోజులు దాటింది. మరో 10 రోజుల్లో ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా జరగనుంది. అయితే ఈ నేపథ్యంలో పలువు జిల్లాలోని రిటైరింగ్ అధికారులు తాము విధులు చేయలేమని.. తమను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని రాష్ట్ర అధికారులకు  మొర పెట్టుకుంటున్నారు. అయితే దీనిపై అధికారులు వారిని బొజ్జగిస్తూ వస్తున్నారు. ఇంకొన్ని రోజులు ఆగండి అంటూ సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా పల్నాడు, చిత్తూరు, తిరుపతి, గుంటూరు, అనంతపురం జిల్లాలకు చెందిన రిటర్నింగ్ అధికారులు అదుల సంఖ్యలో విధులు చెల్లించామని తెలియజేస్తున్నారు.
నిజానికి దిగువ స్థాయి ఉద్యోగులు ఇలా.. ఉద్యోగాలు చేయలేమని.. వెళ్ళిపోతామని చెప్పడం ఇదే తొలిసారి. మరి దీనికి కారణం.. అయ్యే జిల్లాల్లో ఎన్నికల పోలింగ్ జరిగిన ఈనెల 13న అల్లర్లు చెలరేగడం. ఈవీఎంలను కూడా ధ్వంసం చేయడం. ఈ ఘటనలకు సంబంధించి అటు రాజకీయ పార్టీలు నుంచి ఇటు పోలీసుల నుంచి కూడా అధికారులపై తీవ్ర బత్తిళ్లు పెరుగుతున్నాయి. రాజకీయ పార్టీలు కొన్ని నిజాలు చెప్పాలని.. మరికొన్ని నిజాలు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నాయి. ఇదే సమయంలో పోలీసులు విచారణ పేరుతో గంటలకొద్దీ స్టేషన్లలో కూర్చోబెడుతున్నారు.
ఇక మరోవైపు ఇలా ఎందుకు జరుగుతుందని.. మీరేం చేశారని.. ప్రశ్నిస్తూ ఎన్నికల సంఘం నుంచి వివరణ పేరుతో వేధింపులు వస్తున్నాయి అని రిటైరింగ్ అధికారులు చెబుతున్నారు. దీంతో ఉద్యోగులు నలిగిపోతున్నారు. తీవ్రంగా మదన పడుతున్నారు. ఈ టెన్షన్ను తట్టుకోలేక ఆయా జిల్లాలకు చెందిన రిటైరింగ్ అధికారులు పదుల సంఖ్యలో ఉద్యోగాలకు కూడా సెలవు పెడుతున్న పరిస్థితి ఏర్పడింది. అలా ఏపీలో ఎన్నడూ లేని విధంగా టెన్షన్ వలన ఉద్యోగాలను కూడా రిజైన్ చేస్తున్నారు పలువురు. ఇటువంటి సంఘటన చూసి పలువురు ప్రజలు కంగారుపడుతున్నారు. ప్రెసెంట్ రిటైరింగ్ అధికారులకే ఈ విధమైన ప్రెషర్ ఉంటే సామాన్య ప్రజలు ఇంకెంత కష్టపడుతున్నారో అర్థం చేసుకోండి అంటూ మనవచేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: