జూన్ 1... ఆ రెండు గుర్తొచ్చి తెలుగు తుమ్మ‌ళ్ల‌కు నిద్రే ప‌ట్ట‌ట్లేదా..?

lakhmi saranya
దేశం నుంచి రాష్ట్రం వరకు ప్రతి ఒక్కరూ.‌.. జూన్ 4 కోసం ఎదురుచూస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు.. ఇటు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు మరో నాలుగు రోజుల్లో పూర్తికానున్నాయి. ఇక ఇప్పటి వరకు ఆరు దశల పోలింగ్ పూర్తయింది. మరో అడుగు మాత్రమే ముందుకు పడాల్సి ఉంది. జూన్ 1 సార్వత్రిక ఎన్నికల ఏడవ దశ ‌ పోలింగ్ కూడా పూర్తికానుంది. దీంతో మొత్తంగా ఎన్నికల ప్రక్రియ పూర్తయిపోయింది. అందరూ దీని కోసమే ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
అయితే.. చిత్రంగా ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టిడిపి నాయకులు, కార్యకర్తలు మాత్రం జూన్ 1 కోసం ఎదురు చూస్తున్నారు. మరి దీని వెనుక రీజన్ ఏంటి? అనేది కూడా ఆసక్తిగా మారింది. వాస్తవానికి ఎవరైనా ఫలితం కోసం ఎదురుచూస్తారు. కానీ టిడిపి నాయకులు మాత్రం జూన్ 1 కోసమే ఎదురుచూస్తున్నారు. దీనికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఆరోజు సాయంత్రం 6:00 కు 7 దశ పోలింగ్ ముగిసిపోతుంది. అనంతరం ఎర్జిట్ ‌ పోల్స్ ఫలితాలు వెల్లడించేందుకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది.
దీంతో దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కూడా ఎగ్జిట్ పోల్స్ రూపంలో పలు సంస్థలు వెల్లడించనున్నాయి. ఏపీకి సంబంధించి కొన్ని సార్లు సంస్థలు ఇప్పటికే తమతమ ఫలితాలతో రెడీ అయ్యాయి. దీంతో టీడీపీ నేతలు చాలా ఉత్కంఠ గా ఎదురుచూస్తున్నారు. తమ కోటమే విజయం దక్కించుకుంటుందని ఇప్పటికే లెక్కలు వస్తున్న దరిమిలా వారు ఉత్సాహంగా ఉన్నారు. ఇక దీనికంటే కూడా ఎక్కువగా ఎదురు చూస్తున్నా రెండో అంశం మరొకటి ఉంది. ఇది జూన్ 1 నా టిడిపి అధినేత చంద్రబాబు స్వయంగా చేయించిన రెండు సర్వేల ఫలితాలను కూడా పార్టీ విడుదల చేయను ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. దీంతో చంద్రబాబు సర్వేలో ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: