అలాంటి వ్యక్తుల గురించి ఆలోచించకపోవడం చాలా మంచిది.. పరిణితి చోప్రా..!

Pulgam Srinivas
హిందీ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటీమణులలో పరిణితి చోప్రా ఒకరు. ఇప్పటి వరకు ఈమె ఎన్నో బాలీవుడ్ సినిమాలలో నటించి అందులో చాలా మూవీలతో మంచి విజయాలను అందుకొని హిందీ సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇకపోతే ఈమె హిందీ సినిమాలలోనే ఎక్కువ శాతం నటించిన ఈమె నటించిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధించడంతో ఈమెకు ఇండియా వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇకపోతే కొంత కాలం క్రితమే ఈ బ్యూటీ అమర్‌సింగ్ చంకీల అనే సినిమాలో నటించింది.

ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. అలాగే ఈ మూవీ లోని పరిణితి చోప్రా నటనకు కూడా మంచి గుర్తింపు లభించింది. 27 ఏళ్ల వయసులో హత్యకు గురైన ప్రముఖ పంజాబీ గాయకుడు అమర్‌సింగ్ చంకీల జీవితం ఆధారంగా ఈ మూవీ ని ఇంతియాజ్‌ అలీ తెరకెక్కించారు. ఇకపోతే తాజాగా పరిణితి చోప్రా తన సోషల్ మీడియా వేదికగా ఎవరితో ఎంత వరకు ఉండాలి , ఎవరి కోసం ఏమి చేయాలి ... ఏమి చేయకూడదు ఇలా అనేక విషయాల గురించి స్పందించింది.

తాజాగా ఈ బ్యూటీ జీవితంలో ప్రతీ క్షణం కూడా చాలా విలువైనది. ఆ విలువైన టైమ్ ను ఎప్పుడు కూడా ఇతరుల మెప్పు పొందేందుకు కాకుండా మనకు నచ్చినట్లు జీవించాలి. ఇతరులను మెప్పించడానికి బతకడం మొదలు పెడితే మన కోసం మనం బతకడం మరిచిపోతాం అని ఈమె తెలియజేసింది. అలాగే విలువ లేని వ్యక్తులు , విషయాలను జీవితంలో పట్టించుకోవడం మానేస్తేనే చాలా మంచిది అని ఈమె సూచించింది. మన చుట్టూ ఉండే ప్రపంచాన్ని మర్చిపోయి మనం జీవించాలి. మన ఆనందంతో పాటు మనవారి ఆనందం కూడా ముఖ్యం అని ఈమె తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: