దేశంలోని హాట్ టాపిక్ ఇపుడు ఇదే?

Suma Kallamadi
అవును, ఇపుడు దేశంలోనే ప్రప్రధమైన టాపిక్ ఏదైనా ఉంది అంటే.. అది నీతి ఆయోగ్ మీటింగ్. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఇండియా కూటమి పాలిత రాష్ట్రాలకు అన్యాయం జరిగిందనే ఆరోపణలు కేంద్రమైన బలంగా వినబడుతున్నాయి. ఈ నేపధ్యంలో దానిని నీతి ఆయోగ్ మీటింగ్ అని పేర్కోవడం జరిగింది. అయితే ఈ అవకాశాన్ని వాడుకోవాలని కొందరు సీఎంలు ఆలోచిస్తూనే మీటింగ్ కి వెళ్ళకుండా బహిష్కరించి తమ నిరసనను తెలియచేయాలని మరి కొందరు సీఎంలు ఆలోచిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక బాయ్ కాట్ చేసే సీఎంల జాబితాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉండనే ఉన్నారు. తాను తన మంత్రులు అనేక సార్లు ఢిల్లీ వెళ్ళి కేంద్రాన్ని అర్ధించినా తమ రాష్ట్రానికి దారుణంగా అన్యాయం చేశారు అని రేవంత్ రెడ్డి ఇటీవల ఫైర్ అయిన సంగతి విదితమే. గతంలో కేంద్రం మీద కోపంతో కేసీఆర్ ఇలాగే ప్రవర్తించడం జరిగింది. కాగా రేవంత్ రెడ్డి కూడా ప్రస్తుతం కెసిఆర్ బాటలో సాగుతున్నట్టు కనబడుతోంది.
అదే విధంగా పంజాబ్ సీఎం, తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ కి వెళ్లడం లేదని గుసగుసలు వినబడుతున్నాయి. ఇక్కడ వచ్చిన చిక్కంతా ఏమిటంటే.. వీరంతా ఇండియా కూటమిలో మిత్ర పక్షాలు కావడం. ఇక ఇండియా కూటమిలో కీలకంగా ఉన్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాత్రం వేరే రూట్ ని ఎంచుకోవడం గమనార్హం. తాను నీతి ఆయోగ్ సమావేశానికి హాజరై అక్కడే ప్రధాని ముందే తన నిరసనను వ్యక్తం చేస్తాను అని చెప్పడం. దాంతో నీతి ఆయోగ్ మీటింగ్ లో ఆమె శివమెత్తే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే త్వరలో మొదలవ్వబోయే నీటి ఆయోగ్ మీటింగ్ మంచి రసవత్తరంగా సాగబోతుందని అని అంటున్నారు.
అవును, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి హాట్ హాట్ గా ఈ సమావేశాలు జరిగే అవకాశాలు ఉందనున్నట్టు తెలుస్తోంది. మరో వైపు నీతి ఆయోగ్ సమావేశాలకు ఇండియా కూటమి సీఎంలు అంతా హాజరై తమ రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష చూపించడాన్ని అక్కడే నిలదీస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి. ఈ విషయంలో మమతా బెనర్జీ దారిలోనే వెళితేనే కరెక్ట్ అని అంటున్నారు. ఇక పూర్తిగా బహిష్కరిస్తే కేంద్రానికి నొప్పి తెలిసే అవకాశాలే ఉండవని అంటున్నారు. ఏది ఏమైనా మోడీ మూడోసారి ప్రధాని అయ్యాక నీతి ఆయోగ్ వంటి మీటింగులు సైతం వేడెక్కించడం బట్టి చూస్తే దేశంలో విపక్షాల బలం వారి గ్రాఫ్ ఏ స్థాయిలో పెరుగుతోందో అర్ధం చేసుకోవలని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: