రాబోయే అక్టోబర్ మెగా నందమూరి ఫ్యాన్స్ కి పండగే?

Purushottham Vinay
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా గేమ్ చేంజర్ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమా షూటింగ్ మాత్రం ఇంకా పూర్తి అవడం లేదు.దీంతో విడుదల తేదీ కూడా ఇప్పటిదాకా ప్రకటించడం లేదు. కానీ తాజాగా ఈ సినిమా నిర్మాత దిల్‌ రాజు కూతురు హన్షిత రెడ్డి ఇటీవల ఒక చిట్‌ చాట్‌లో మాట్లాడుతూ..గేమ్ చేంజర్ సినిమా విడుదల అక్టోబర్‌ నెలలో ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు. అయితే రిలీజ్ డేట్ మాత్రం ఇంకా క్లారిటీగా చెప్పలేదు. కానీ అక్టోబర్ అంటే.. 31న గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం తెలుస్తుంది.ఎందుకంటే ఆరోజు గురువారం అవుతోంది. పైగా దీపావళి పండగ కాబట్టి.. లాంగ్ వీకెండ్ కలిసొచ్చేలా గేమ్ చేంజర్ సినిమా రిలీజ్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సినిమాకి హిట్ టాక్ వస్తే ఖచ్చితంగా ఆర్ఆర్ఆర్ రికార్డ్స్ బద్దలు కావడం పక్కా. పైగా రామ్ చరణ్ ఇండియా వైడ్ గా టాప్ 100 యాక్టర్స్ లో చోటు సంపాదించుకున్నారు.


రామ్ చరణ్ 31 వ స్థానంలో నిలవగా ప్రభాస్ 29 వ స్థానంలో ధనుష్ 30 వ స్థానంలో విజయ్ 32 వ స్థానంలో నిలిచారు.అక్టోబర్ 10 వ తేదీన దసరా కానుకగా దేవర సినిమా రిలీజ్ అవుతోంది. దీంతో.. అక్టోబర్‌ నెలలో గేమ్ చేంజర్ దేవర సినిమాకి పోటీగా వస్తుందనే చర్చ జరుగుతోంది. కానీ అలా జరిగే ఛాన్స్ లేదు. దేవర వచ్చిన మూడు వారాల తర్వాతే గేమ్ చేంజర్ సినిమా థియేటర్లోకి రానుందని అంటున్నారు. దేవర దసరాను టార్గెట్ చేస్తే.. గేమ్ చేంజర్ దీపావళి పండగను క్యాష్ చేసుకోనుంది. కానీ అక్టోబర్‌లో మాత్రం మెగా నందమూరి అభిమానులకు నిజంగా పండగేనని చెప్పాలి. అతి త్వరలోనే గేమ్ చేంజర్ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతానికైతే.. శంకర్ ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు.సీనియర్ హీరో శ్రీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఎస్ ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. శంకర్ మార్క్ పొలిటికల్ డ్రామాగా వస్తున్న గేమ్ చేంజర్ మామూలుగా ఉండదని ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: