ఏపీ రాజకీయాలు: కన్ఫ్యూజన్ తో ప్రజలను పిచ్చెక్కిస్తున్న పంచాంగ కర్తలు..!

Divya
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల పైన ఇప్పటివరకు సర్వేలు సైతం తెలియజేస్తూ ఉన్నాయి .కానీ ఈ రోజున పంచాంగ కర్తలు కూడా విశ్లేషిస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.. ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ కంటే తామే ముందుగానే ఎవరు అధికారంలోకి వస్తామని చెబుతామని.. ఇలాంటి విషయాలను తమకు క్రెడిబులిటీ కూడా ఉందని తెలియజేస్తున్నారు. తాజాగా కోనసీమకు చెందిన పంచాంగ కర్తలు నాయకుల జాతకల ఆధారంగా లెక్కలు వేసి మరి ఆంధ్రప్రదేశ్లో గెలుపోటములపైన చెబుతున్నారు. అంతేకాకుండా ఎన్ని సీట్లు వస్తాయో కూడా క్లియర్ గా చెప్పేస్తున్నారు.

ముఖ్యమంత్రి ఏ రోజు ప్రమాణస్వీకారం చేస్తే బాగుంటుందని విషయం పైన కూడా తెలియజేస్తున్నారు వైసిపి 106 సీట్లతో విజయం సాధిస్తుందని జగన్ మళ్ళీ సీఎం కావడం తద్యమంటూ  తాడేపల్లిగూడెం కి చెందిన ప్రముఖ సిద్ధాంతకర్త వల్ల వార్డుల శ్రీరామకృష్ణ శర్మ తెలియజేశారు.. అలాగే టీడీపీ పార్టీ 69 స్థానాలే వస్తాయని తెలిపారు.. తన ప్రిడిక్షన్ ఎలా ఉంటుందంటే తెలంగాణలో జరిగిన ఎన్నికలలో అందరూ బిఆర్ఎస్ పార్టీ వస్తుందని చెప్పారు. కానీ తాను మాత్రం కాంగ్రెస్ వస్తుందని ముందే చెప్పానని ఇప్పుడు ఏపీలో కూడా తాను చెప్పేది నిజమవుతుందని వెల్లడిస్తున్నారు.

మరొకవైపు టీడీపీ జనసేన బిజెపి కూటమి కూడా 135 సీట్లు వస్తాయని అమలాపురానికి చెందిన పంచాంగ కర్త ఉపదృష్ట నాగాదిత్య తెలియజేశారు. అయితే ఉపదృష్ట నాగాదిత్య మాత్రం ఎగ్జిట్ పోల్స్ లో పసవుండదని తమ ప్రొడక్షనే కరెక్ట్ అవుతుందని ఎవరికి వారు జాతకాలు చెప్పేస్తున్నారు. మరి ఎవరి భవిష్యవాణి నిజమవుతుందో తెలియాలి అంటే జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే.. అయితే ఇప్పటికే ప్రజలు సర్వేలతో కన్ఫ్యూజన్ అవుతున్న సమయంలో ఇప్పుడు మళ్లీ  పంచాంగ కర్తలు సైతం ఎవరికి వారు యమునా తీరు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఎవరు అధికారంలోకి వస్తారనే విషయం పైన ప్రజలు తలలు పట్టుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: