వైసిపి షాకింగ్ ప్లాన్ ను.. బయటపెట్టిన నాగబాబు..!

lakhmi saranya
ఇప్పుడిప్పుడే ఏపీలో ఎలక్షన్స్ హడావిడి తగ్గుముఖం పట్టింది. ఎవరు గెలుస్తారో అనే ఉత్కంఠ ఉన్నప్పటికీ ఆపోజిట్ పార్టీలపై కామెంట్స్ చేసుకోవడం వంటివి లేవు. మొదట్లో గోరాతి ఘోరంగా తిట్టుకున్న పార్టీలు ప్రస్తుతం కామ్ అయిపోయాయి. అటువంటి సమయంలో జనసేన పార్టీకి చెందిన నాగబాబు ఓ వీడియోని షేర్ చేసి మరోసారి కలకలం రేపారు. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వయాన అన్నయ్య ఆయన నాగబాబు సైతం జనసేన పార్టీ గలుపు కోసం కసరత్తులు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఆపోజిట్ పార్టీపై పలు వ్యాఖ్యలు కూడా చేశారు నాగబాబు.
ఇప్పటివరకు నాగబాబు మాట్లాడిన మాటలు అన్నీ ఒక ఎత్తు అయితే తాజాగా ఓ వీడియో షేర్ చేస్తూ.. కూటమి గెలుపు పక్కా అంటూ క్లారిటీ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. ఓ వీడియోని షేర్ చేస్తూ.." అందరికీ నమస్కారం. జన సైనికులకు ,వీర మహిళలకు, నాయకులకు , ముఖ్యంగా పిఠాపురం జన సైనికులు మరియు వీర మహిళలకి..‌ అలాగే కూటమిలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి.. ప్రతి కార్యకర్తకి నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఇవాళ.. కూటమి విజయానికి చెరువులో దగ్గరలో ఉంది.
వైసిపి పరాజయం అంచుల్లో ఉంది. సో.. ఎప్పుడైతే ఒక మనిషి పరాజయం  అవుతాడు అని తెలియగానే.. ఒక రకమైన ఫ్రస్టేషన్, గొడవలు చేయడానికి సిద్ధమవుతూ ఉంటారు. మీ అందరికీ నా విన్నపం ఏమిటంటే.. రేపు ఓట్లు లెక్కించి సమయంలో.. మనం సమయం పాటించి ప్రభుత్వానికి ఎన్నికల సంఘం వారికి పోలీసులకి మనం చక్కగా సహకరిద్దాం. అదేవిధంగా వైసీపీ చర్యలకు ప్రతిస్పందించవద్దు.  ఎందుకంటే.. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అన్నట్లుగా.. వైసిపి ఎగిరి పడితే అన్ని ఉన్న మనం అనిగిమనిగి ఉండాలి. మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం.. " అంటూ ఓ వీడియోని విడుదల చేశాడు నాగబాబు. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: