Ap Politics: సజ్జలను తక్షణమే అరెస్ట్ చేయాలి.. దేవినేని ఉమా భారీ డిమాండ్.. కారణం ఏంటి..?

lakhmi saranya
నేడు టిడిపి మాజీ మంత్రి దేవినేని ఉమా సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం దగ్గర లక్షలాది రూపాయలు జీతం తీసుకుంటూ.. గత ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వ సలహాదారు పదవి వెలగబెడుతున్న సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో రూల్స్ పాటించే వాళ్ళు ఏజెంట్లగా కూర్చోవద్దని వైసిపి చీప్ కౌంటింగ్ ‌ ఏజెంట్ల‌ కి ఉద్బోధించారని ఆరోపించారు. గత 24 గంటలుగా అటు మీడియాలోనూ ఇటు సోషల్ మీడియాలోనూ సజ్జల వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
కావున ఎన్నిక సంఘం ఇమీడియట్గా సజాలపై క్రిమినల్ కేసు బుక్ చేసి అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రూల్స్ ను కాదనలేక వెనక్కి తగ్గే వాళ్ళు ఏజెంట్లుగా వద్దు.. మనమేమి రూల్స్ ను ఫాలో అయ్యేందుకు అక్కడికి వెళ్లడం లేదని సజ్జల అన్నారని పేర్కొన్నారు.  ఇక నిబంధనలు నియమాలు పాటించేవాళ్లు ఎన్నికల కౌంటింగ్ కు వెళ్లొద్దు, టిడిపి, జనసేన కౌంటింగ్ ఏజెంట్ల మీద తిరగబడే వాళ్ళు, వాళ్లతో దెబ్బలాడే వాళ్లు మాత్రమే కౌంటింగ్ కు వెళ్లాలని సజ్జల చెప్తున్నారంటే ఇంతకీ చట్టం పట్ల.. ఎలక్షన్ కమిషన్ నిబంధనల పట్ల ఎంత గౌరవం ఉందో అర్ధమవుతుందని ఎద్దేవా తెలిపారు. ఇ
క ఇటువంటి చట్టవిరోధులని, చట్టాన్ని అతిక్రమించే వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రెసెంట్ ఇన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సంఘటన చూసిన పలువురు.." ప్రజెంట్ ఏపీలో ఉన్న గోలలు సరిపోవు అన్నట్లుగా మరో కొత్త వివాదాన్ని రేపారా? ప్రజెంట్ జరుగుతున్న గొడవలు చూస్తుంటే ఈసారి ఎన్నికల ఫలితాలు అటూ ఇటూ అయితే ఏకంగా చంపేసుకుని లాగా ఉన్నారుగా. ఏ ప్రభుత్వం గెలిచిన ప్రజలకి ఒరిగేదేమీ ఉండదు. ఇలా గొడవ పడడడమే తప్ప మీరు ఏమీ చేయరు " అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: