యాక్షన్ హిట్.. సినిమా ఫట్..!
అప్పటికి మూడు జాతీయ అవార్డులను అందుకని మంచి విజయాలను చవిచూసిన శారద, ఆ తర్వాత అమ్మమ్మ , నాయనమ్మ పాత్రలు చేస్తూ వచ్చింది.. కానీ.. ఒక్కసారిగా యోగి తల్లి పాత్రలో నటించడంతో తెలుగు ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. అంతే కాదు తల్లి కి బంగారు గాజులు తెస్తానని యోగి వెళ్లడం, ఒక హోటల్లో పని చేయడం, ఆ తర్వాత అనుకోని కారణాల చేత యోగి ని జైల్లో పెట్టడం.. తిరిగి ఆమె శారద కొడుకు ని వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చి ,పక్కనే ఉన్న ప్రభాస్ ఆమెను గుర్తించలేకపోవడం , చివరికి శారద చనిపోవడం ఇలా సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను అసల మెప్పించలేకపోయింది.
ఇక అంతే కాకుండా ఈ సినిమాలో ఏ సీను కూడా స్పష్టంగా లేకపోవడం, తికమక పెట్టడంతో ప్రేక్షకులు సరిగ్గా ఈ సినిమాను ఆదరించ లేకపోయారు. ఇక యాక్షన్ పరంగా ఈ సినిమా సూపర్ హిట్ అని చెప్పాలి.. కానీ సెంటిమెంట్ సీన్స్ ప్రేక్షకులను మెప్పించలేక పోయాయి. ఇక భారీ వైలెన్స్ తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందు బోల్తా కొట్టింది.భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రం ఇలా ఒక్కసారిగా మొదటి షో తోనే అట్టర్ ప్లాప్ అనిపించుకోవడం తో , ప్రభాస్ కెరీర్ లో ఇదొక పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. సినిమా చూసిన వారందరూ యాక్షన్ పరంగా సూపర్ హిట్ అని చెప్పి, సినిమా మాత్రం చండాలంగా ఉంది అంటూ చెప్పేశారు.. ప్రభాస్ ఈ డిజాస్టర్ ను మర్చిపోలేదనే చెప్పాలి.