బాలీవుడ్ తారపై విపరీతమైన ట్రోలింగ్... ఆమె ఏం చేసిందంటే?
ఈ భామ వేసుకున్న డ్రెస్‌కు బాగా చిరుగులు ఉన్నాయి. షర్ట్, ప్యాంట్ అన్నీ చిరిగిపోయే ఉన్నాయి. ఆ ఫొటోలు చూసి నెటిజన్లు ఇదెక్కడి ఫ్యాషన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. డబ్బులు ఎక్కువయ్యేకద్ది ఇలాంటి విపరీత పోకడలే కనిపిస్తుంటాయని నెగెటివ్ పోస్టులు పెడుతున్నారు. ఓ కార్యక్రమానికి హాజరయ్యేప్పుడు ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. చిరిగిన డ్రెస్‌ను బిచ్చగాళ్లు కూడా వేసుకోబోరని, ఒక వేళ వేసుకున్నా కవర్ చేసుకుంటారని, కానీ ఊర్వశీకి ఆ మాత్రం కవరింగ్ సెన్స్ లేదని మరికొందరు నెటిజన్లు అంటున్నారు. మొత్తంగా ఆమెను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు.
అయితే, వృత్తి ధర్మంలో భాగంగానే ఊర్వశీ రౌటేలా ఇలాంటి డ్రెస్సులు ధరిస్తోందని వాదించే వారూ ఉన్నారు. ప్రొఫెషనల్, హాట్ గర్ల్‌గా కనిపించేందుకుగాను ట్రెండీ డ్రెస్సెస్ ఊర్వశీ ధరిస్తున్నదని అంటున్నారు. అయితే, గతంలోనూ ఊర్వశీ ధరించిన బట్టలపై కామెంట్స్ వినిపించాయి. మీడియా, ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షించేందుకే ఇలాంటి బట్టలను ఊర్వశీ ధరిస్తున్నదని బీ టౌన్ టాక్. కాగా, ‘సూపర్ హాట్ గర్ల్‌గా, సోషల్ మీడియా క్వీన్’గా ఊర్వశీ కీర్తించబడటం గమనార్హం. చూడాలి మరి చివరికి ఈ విషయం ఎక్కడి వరుకు వస్తుందో.