మహానటి ఎత్తుకున్న ఈ ఫొటోలోని బాబు ఎవరంటే..?

Suma Kallamadi
మన సినీ పరిశ్రమలో ఎంతో మంది హీరోలను, హీరోయిన్స్ ను మనం చూస్తూనే ఉన్నాము. ఒక్కో హీరోకి ఒక్కోరకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే అభిమానులు ఎంతగానో ఇష్టపడే హీరోలు చిన్నప్పుడు ఎలా ఉంటారో ఒక్కసారి అయిన చూడాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఈ క్రమంలో ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా మంది హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి.ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా ఒక హీరో ఫోటో బాగా ట్రెండ్ అవుతుంది. అసలు ఆ బాబు ఎవరో ఏంటో కూడా గుర్తుపట్టడం చాలా కష్టంగా ఉంది అని చెప్పాలి.బాబుకి  ఊహ తెలియనప్పటి ఫోటో కాబట్టి గుర్తుపట్టడం కష్టంగా ఉంది. ఈ బాబుని మన మహానటి సావిత్రి ఎత్తుకుని ఉంది.
మరి సావిత్రి ఎత్తుకున్న ఈ బుడ్డోడు ఎవరో మీలో ఎవరన్నా గుర్తు పట్టారా..? కష్టం అంటారు కదా..అయితే మేమే చెప్పేస్తున్నాము లెండి. ఆ పసివాడు మరెవరో కదండీ మనం అక్కినేని నాగేశ్వరావు గారి వారసుడు అక్కినేని నాగార్జున.. ఏంటి షాక్ అయ్యారా. సావిత్రి ఎత్తుకున్నది మాత్రం మన మన్మధుడు నాగార్జుననే.అప్పుడు ఆ పసివాడి వయసు కేవలం 8 నెలలు మాత్రమే. చూడడానికి భలే క్యూట్ గా ఉన్నాడు కదా.
నాగార్జున ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా అందంగానే ఉంటాడు అని ఈ ఫోటో చుసిన ప్రతి ఒక్కరు కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. అక్కినేని నాగేశ్వరావు తన వారసుడును అంత చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టించేసాడు మరి. ఎంతయినా కళా పోషణ ఉన్న కుటుంబం కాబట్టి జీన్స్ ఎక్కడికి పోతాయి చెప్పండి.అంత చిన్న వయసులోనే మన నాగార్జున వెండితెరపై కనిపించారు.ఇంతకీ ఇది ఏ సినిమాలో ఫోటో అనుకుంటున్నారు. మీకు అలనాటి ప్రేక్షకులు మెచ్చిన వెలుగు-నీడలు అనే సినిమా గుర్తు ఉందా. ఆ సినిమాలో మన నాగేశ్వరావు, సావిత్రిలు హీరో హీరోయిన్స్ గా నటించారు. ఆ మూవీతోనే నాగ్ బాల నటుడిగా మనకు కనిపించాడు. ప్రస్తుతం మహానటి ఎత్తుకున్న నాగార్జున ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. !

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: