ప్రభాస్ ఫ్యాన్స్ అప్పటివరకు ఆగాల్సిందే..?

Anilkumar
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్స్ తో బిజీ బిజీగా గడుపుతున్నాడు.అందులో ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ సినిమా షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది.రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టనున్నారు చిత్ర యూనిట్.ఇక ఇదిలా ఉంటె మరోవైపు సలార్, ఆదిపురుష్ షూటింగ్ లను కూడా ఇప్పటికే మొదలు పెట్టేసాడు ప్రభాస్. ప్రస్తుతం ఈ రెండు సినిమా షూటింగ్స్ తో బిజీగా వున్నాడు. ఇక నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రభాస్ చేయబోయే భారీ పాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్ట్ కె షూటింగ్ కూడా త్వరలోనే మొదలు కానుంది.

అయితే ఇక్కడివరకు బాగానే ఉన్నా..ప్రభాస్ సినిమాలకు సంబంధించి అప్డేట్స్ లేక ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు.ఈ మధ్య కాలంలో ఒక్క ప్రభాస్ తప్పా.. మిగతా అగ్ర హీరోలందరి సినిమాల అప్డేట్స్ వస్తున్నాయి.కానీ ప్రభాస్ మాత్రం తన ఫ్యాన్స్ ని ఈ విషయంలో తెగ నిరాశపరుస్తున్నాడు.అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన హీరో సినిమాల సర్ ప్రైజ్ ల కోసం ఆయన పుట్టినరోజు వరకు ఆగాల్సిందేనట.అక్టోబర్ 23 వ తేదీన ప్రభాస్ తన పుట్టినరోజును జరుపుకోనున్నాడు.ఈ సంవత్సరం తో ప్రభాస్ 42 వ వసంతంలోకి అడుగుపెట్టనున్నాడు.అయితే ఆ రోజు మాత్రం ఒకటి కాదు ఏకంగా మూడు సర్ ప్రైజ్ లను ఇవ్వనున్నాడట ప్రభాస్.

అందులో రాధే శ్యామ్ మేకింగ్ వీడియోతో పాటు టీజర్ కూడా ఆ రోజు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ పుట్టినరోజుకి ఇంకా చాలా సమయం ఉండటంతో రాధే శ్యామ్ నుండి ఫస్ట్ సింగిల్ విడుదలైతే బాగుంటుందని భావిస్తున్నారు.ఇక అటు యూవీ క్రియేషన్స్ సైతం రాధే శ్యామ్ సినిమాపై హైప్ పెంచడానికి ప్రమోషన్ కార్యక్రమాలను ఓ రేంజ్ లో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.ఇక అంతేకాకుండా ప్రభాస్ బర్త్ డే రోజునే సలార్, ఆదిపురుష్ నుంచి పోస్టర్లు లేదా టీజర్లు విడుదలయ్యే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ఒక్కో సినిమా బడ్జెట్ దాదాపు 300 కోట్లకు పైమాటే.ఇక ఆ సినిమాలు కనుక సక్సెస్ సాధిస్తే ప్రభాస్ మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఉంది.ఇక మరోవైపు ఫ్యాన్స్ మాత్రం సినిమా అప్డేట్స్,ప్రమోషన్స్ విషయంలో ప్రభాస్ కాస్త వేగం పెంచితే బాగుంటుందని భావిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: