ఆ సినిమాలు ఇక థియేటర్ కి రావట ?

VAMSI

కరోనా కారణంగా థియేటర్లు మూతపడి ఓటిటి ల హవా పెరిగిన సంగతి తెలిసిందే. కరోనా పీరియడ్ లో చేసేదిలేక చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాల వరకు అన్నీ ఓటిటి వేదికపై విడుదలయి ప్రేక్షకులను అలరించాయి. బిగ్ సెలబ్రిటీ సినిమాలకు ఓటిటిలు క్రేజీ ఆఫర్లు ఇవ్వడంతో అవి కూడా కాదనలేకపోయాయి. ఈ మహమ్మారి సమయంలో లాక్ డౌన్ తో అడుగు బయట పెట్టలేని ప్రజలు, అన్ని విధాలా ఎంటర్టైన్మెంట్ లేక అల్లాడిపోయిన ప్రేక్షకులు ఇలా అందరూ ఓటిటి లకు బాగా అలవాటు పడ్డారు. మరోవైపు వెబ్ సిరీస్ లు, సెలబ్రిటీలతో షోలు ఈ వేదికలపై సందడి చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇలా అన్ని రకాలుగా కరోనా కాలం ఓటిటి లకు కలిసొచ్చింది. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతోంది కరోనా తగ్గుముఖం పడుతోంది.
ఇవాళ కాకపోతే రేపైనా థియేటర్లు మళ్లీ పునఃప్రారంభమయ్యి మళ్లీ సినిమాలతో కళకళలాడుతాయి. సెలబ్రిటీలు ఇప్పటిలా అప్పుడు వెబ్ సిరీస్ లపై ఆసక్తి చూపకపోవచ్చు, సినిమాలు ఎలాగూ థియేటర్లలోనే విడుదల అవుతాయి అపుడు ఓటిటి ల పరిస్థితి ఏమిటి ? కరోనా సమయంలో అమాంతం ఒక్కసారిగా పెరిగిన  ఓటిటి క్రేజ్ కాస్త తగ్గి పోవాల్సిందేనా, అంటే ? ఆ చాన్స్ లేనే లేదని తెలుస్తోంది. సినిమా హాళ్లు ఓపెన్ అయినప్పటికీ చిన్న సినిమాలు అన్నీ ఇకపై  ఓటిటి లలోనే విడుదలయ్యేలా  సినీ పరిశ్రమతో ఒప్పందాలు కుదుర్చుకున్నారనే వార్తలు వినబడుతున్నాయి. అయితే వీటి వల్ల  థియేటర్స్ కి కూడా ఆర్థికంగా లాభదాయకంగా ఉండేలా ప్లాన్ చేసి డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.
కేవలం మీడియం మరియు పెద్ద సెలబ్రిటీల సినిమాలు మాత్రమే థియేటర్లలో విడుదల అవుతాయని మిగిలిన చిన్నాచితకా సినిమాలు అన్నీ ఇకపై  ఓటిటి లోనే విడుదలయ్యేలా ఒప్పందాలు జరిగిపోయాయనే వార్తలు ఫిల్మ్ సర్కిల్స్ నుండి వినబడుతున్నాయి. మరి వీటిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: