విలన్ గా మారనున్న ప్రముఖ సింగర్..

Divya

రఘు కుంచే.. నటుడిగా సినీరంగ ప్రవేశం చేసి, ఆ తర్వాత ప్లేబ్యాక్ సింగర్ గా ,  గీత రచయితగా, డబ్బింగ్ కళాకారుడిగా , యాంకర్ గా, చిత్ర నిర్మాతగా , సంగీత దర్శకుడిగా పేరు పొందారు. ఒక వ్యక్తి ఇన్ని రంగాలలో అసాధ్యమైన తన ప్రతిభను కనబరిచడం అంటే అతిశయోక్తి కాదు. రఘు కుంచే తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం లోని గదరాడ లో జన్మించారు. మొదట రఘు కొంచెం తన సినీ జీవితాన్ని  2000వ సంవత్సరంలో వచ్చిన బాచి చిత్రం ద్వారా తన గానాన్ని ప్రేక్షకులకు వినిపించాడు.
తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలకు గాను సుమారుగా 700 పాటలు పాడి రికార్డు సృష్టించాడు. మొదటగా సంగీత దర్శకుడిగా 2009లో వచ్చిన బంపర్ ఆఫర్ చిత్రానికి పని చేయగా,  ఆ తర్వాత ఉత్తమ సంగీత దర్శకుడిగా తన సినీ కెరీర్లో మొత్తం ఆరు నంది రాష్ట్ర అవార్డులను గెలుచుకున్నాడు. అంతేకాకుండా ప్లేబ్యాక్ సింగర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా తన ప్రతిభను చూపుతోనే డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా పనిచేశాడు. ఇక ప్రముఖ టీవీ చానల్స్ కు యాంకర్ గా కూడా వ్యవహరించడం విశేషం
బాచి సినిమాలో రఘు తన గానాన్ని అందించడమే కాకుండా ఒక పాత్ర కూడా పోషించాడు. అంతేకాదు ఇటీవల వచ్చిన 2020 లో వచ్చిన "పలాస 1978" చిత్రంలో ఒక పాత్ర పోషించడమే కాక సంగీత దర్శకుడిగా కూడా వ్యవహరించాడు. 2021లో కూడా క్షణక్షణం చిత్రంలో కూడా నటించాడు. అయితే అన్ని రంగాల్లో మంచి ప్రావీణ్యం పొందిన దర్శకుడు రఘు కుంచే, ఇప్పుడు సరికొత్త పాత్రలో ప్రేక్షకులను అలరించడానికి ముందుకు వస్తున్నారు..

కమెడియన్ సప్తగిరి హీరోగా, త్రిభాషా ఇల్యూజన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతోన్న ఎయిట్ చిత్రంలో సరికొత్తగా విలన్ క్యారెక్టర్ లో కనిపించటానికి సిద్దం అవుతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అలాగే ఫస్ట్ లుక్ ను  విడుదల చేసేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. అన్ని రకాలుగా మంచి గుర్తింపు పొందిన రఘు కుంచె, ఈ సారి  విలన్గా రాణిస్తాడో లేదో వేచి చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: