పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ ల పెళ్లి వెనుక దాగి ఉన్న రహస్యం ఇదే..

Divya
ప్రేమ అనేది ఎప్పుడు, ఎక్కడ , ఎలా, ఎవరి మనసులో చిగురిస్తుందో చెప్పడం చాలా కష్టం. ఇక ఈ ప్రేమకు కులం కానీ, ఆస్తి అంతస్తులు కానీ ,వర్గ భేదాలు కానీ ఏవి గుర్తుకు రావు. ఉన్నదల్లా స్వచ్ఛమైన మనసు మాత్రమే. అలా మొదటి భార్య ఉందని తెలిసినప్పటికీ, అతనికి రెండో వివాహం అయిందని తెలిసి కూడా కొంతమంది స్టార్స్ ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు.అయితే అదే దారిలోనే ఎంతో మంది స్టార్స్ వున్న విషయం తెలిసిందే. ఇక పవన్ కల్యాణ్ కు తను రెండవ భార్య అని తెలిసినప్పటికీ రేణూ దేశాయ్ పవన్ కళ్యాణ్ ను వివాహమాడింది.. అయితే అందుకు తగ్గ కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..



పుణేకు చెందిన రేణుదేశాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన "బద్రి" సినిమాతో తొలిసారిగా వెండితెరపై మెరిసింది.  ఆ తర్వాత పవన్ కల్యాణ్ దర్శకత్వంలో వచ్చిన జానీ  సినిమాలో మరోసారి పవన్ పక్కన నటించింది. అప్పటికే పవన్ కు పెళ్లయిన భార్యకు దూరంగా ఉండడంతో పవన్, రేణూదేశాయ్ కలిసి సహజీవనం చేశారు. 2018 లో పవన్ రేణూను  వివాహం చేసుకున్నారు. అయితే ఇక్కడ మరో విశేషం ఏమిటంటే వీరి కొడుకు అకీరా సమక్షంలో వీరి పెళ్ళి జరగడం విశేషం.. ఈ దంపతులకు అకీరా , ఆద్య అనే ఇద్దరు పిల్లలు  వున్నారు.


బద్రి సినిమా  ముందు వరకు రేణుదేశాయ్ ఎవరో కూడా సినిమా లోకానికి తెలియదు. అయితే అప్పటికే పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అయ్యాడు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తిరుగులేని ముద్ర వేసుకున్నాడు .అలా పవన్ కళ్యాణ్ జీవితంలో కి రెండో భార్యగా ఎంట్రీ ఇచ్చింది రేణు దేశాయ్.. అయితే రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ ను ప్రేమించింది. ఇక ఆ కారణం చేతనే తనకు ఆల్రెడీ పెళ్లి అయిన విషయం తెలిసి కూడా ఆమె పవన్ కళ్యాణ్ తో సహజీవనం చేసి మరీ పెళ్లి చేసుకుంది. అయితే  వీరి వైవాహిక బంధం కూడా ఎక్కువ రోజులు కొనసాగలేదు. పవన్ తీన్ మార్ సినిమాలో నటించిన రష్యాకు చెందిన అన్న తో వివాహం చేసుకోవడంతో రేణూ దేశాయ్ పవన్ బంధం ముగిసింది.. ఇక ప్రస్తుతం రేణూ దేశాయ్ సామాజిక మాధ్యమాల గురించి ఆలోచిస్తూ, కోవిడ్ రోగులకు కావలసిన అన్ని సౌకర్యాలను అందజేస్తూ తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: