అల్లరి నరేష్ తన కెరీర్ లోనే భారీ రెమ్యూనరేషన్ తీసుకున్న సినిమా ఏంటో తెలుసా..??
నిజంగా ఇది అల్లరి నరేష్ కెరీర్ లోనే భారీ పారితోషికంగా నిలిచింది. తను హీరోగా నటించే సినిమాలకు అటుఇటుగా కోటి రూపాయలు తీసుకుంటాడు అల్లరి నరేష్. కొన్ని సినిమాలకు అంతకంటే తక్కువ మొత్తానికి పనిచేసిన సందర్భాలున్నాయి.మహర్షి కోసం అల్లరినరేష్ అందుకున్న మొత్తమే అతడి కెరీర్ లోబిగ్గెస్ట్ రెమ్యూనరేషన్ గా చెప్పుకోవాలి. సుడిగాడు సినిమా తర్వాత ఒక్కటంటే ఒక్క సక్సెస్ కూడా అందుకోలేకపోయాడు అల్లరి నరేష్, అదే టైమ్ లో మహర్షి మూవీ ఆఫర్ వచ్చింది.మహేష్ సినిమా కావడం, క్యారెక్టర్ నచ్చడం , పైగా పారితోషికం కూడా ఎక్కువగా ఉండడంతో వెంటనే ఒప్పుకున్నాడు . ఈ సినిమా సక్సెస్ కావడంతో హీరోగా మళ్లీ మార్కెట్ పెంచుకోవాలనే ఆలోచనలో ఉన్నడు అల్లరోడు.
మహర్షి సినిమాతోపాటు గిరి డైరెక్షన్ లో ఓ సినిమా కంప్లీట్ చేశాడు అల్లరి నరేష్. గతంలో నందిని నర్సింగ్ హోం అనే సినిమాను డైరెక్ట్ చేసిన గిరి, తన రెండో ప్రయత్నంగా అల్లరి నరేష్ తో కామెడి ఎంటర్ టైనర్ తీశాడు. లాక్ డౌన్ లొనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసారు.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా.. దీంతో పాటు మొట్టమొదటిసారి 'నాంది' అనే ప్రయోగాత్మక సినిమాలో నటిస్తున్నాడు అల్లరి నరేష్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది..మరి ఈ సినిమా అయినా మన అల్లరోడికి మంచి ఫలితాన్ని ఇస్తుందేమో చూడాలి...!!