ఎన్టీఆర్ తో ఆ అనుభవం మర్చిపోలేనిది.. పూజా హెగ్దే హాట్ కామెంట్స్..!
ఎన్టీఆర్, పూజా హెగ్దే కలిసి అరవింద సమేత సినిమాలో నటించారు. త్రివిక్రం డైరక్షన్ లో తెరకెక్కిన ఆ సినిమా తనకు చాల ప్రత్యేకమైనదని అంటుంది పూజా హెగ్దే. తారక్ తో కలిసి నటించే అవకాశం ఈ సినిమాతో వచ్చిందని ఆయనతో కలిసి పనిచేయడం అద్భుతంగా అనిపించిదని అన్నారు పూజా. తారక్ తో ఈక్వల్ గా ఎనర్జీ లెవల్స్ మెయింటైన్ చేశానని అంటుంది ఈ అమ్మడు. దాని వల్లే ఆన్ స్క్రీన్ లో మా జోడీ బాగుందని అంటుంది.
తారక్ తో ఆన్ స్క్రీన్ మీదే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా ఎన్నో అనుభవాలు అందించిందని చెప్పుకొచ్చింది పూజా హెగ్దే. ప్రస్తుతం తెలుగులో వరుస స్టార్ సినిమాలను చేస్తున్న పూజా హెగ్దే ఐదారేళ్లు తన హవా కొనసాగించేలా ఉంది. ప్రభాస్ తో రాధే శ్యాం, అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాలు ప్రస్తుతం సెట్స్ మీద ఉన్నాయి.