రెండు వారాల్లోనే పవన్ సినిమాను పూర్తి చేస్తానంటున్న ఆ డైరెక్టర్..??

Anilkumar
ఇటీవలే రాజకీయాల్లో నుంచి విరామం తీసుకొని.. సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తన సినిమాల విషయంలో మాంచి దూకుడుని చూపిస్తున్నాడు.ప్రస్తుతం దిల్ రాజు, బోనీ కపూర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న 'వకీల్ సాబ్' సినిమాలో నటిస్తున్నాడు పవర్ స్టార్. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణను జరుపుకుంటుంది.సినిమాలో పవన్ ఓ పవర్ ఫుల్ లాయర్ గా కనిపించనున్నాడు.ఇక చివరిదశకు చేరుకున్న ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ నెలలో పూర్తి కానుండగా.. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్.. క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాకి కమిటయ్యాడు.దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి చాలా రోజులు అవుతుంది.
 కాని ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. క్రిష్ తెలివిగా ఇప్పటికే ఒక షెడ్యూల్ ను పవన్ లేకుండానే పూర్తి చేశాడు. పవన్ బల్క్ డేట్ల కోసం ఎదురు చూడకుండా రెండు మూడు రోజులు టైం ఇచ్చినా కూడా వెంటనే ఆయన సింగిల్ షాట్స్ ను మరియు ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. వకీల్ సాబ్ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ కు రెండు వారాల సమయం ఉండటంతో ఆ టైమ్ ను తనకు ఇవ్వాలంటూ క్రిష్ విజ్ఞప్తి చేశాడట. రెండు వారాల్లో ఏం చేస్తారు.ఒకేసారి పూర్తి చేసేందుకు ఫిబ్రవరి లేదా మార్చిలో చేద్దాం అన్నాడట. కాని క్రిష్ మాత్రం అప్పటి వరకు వెయిట్ చేయడం వృదా పవన్ కు వీలున్నప్పుడు సినిమాను ముగించేద్దాం అన్నట్లుగా వచ్చే నెలలో ఎన్ని రోజులు వీలు అయితే అన్ని రోజుల డేట్లను ఇవ్వమంటూ కోరాడట.
 అందుకు పవన్ కూడా ఒప్పుకోవడంతో షూటింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి.పవన్ రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల ఆయన ఎప్పుడు డేట్లు ఇచ్చేనో అర్థం కాదు. అందుకే వీలున్నప్పుడు చేసుకు పోవడమే బెటర్ అన్నట్లుగా క్రిష్ మాస్టర్ ప్లాన్ వేసి ఇప్పటికే ఆయన లేకుండా ఒక షెడ్యూల్ పూర్తి చేశాడు. ఆయన్ను రంగంలోకి దించి మరో షెడ్యూల్ ను పూర్తి చేయబోతున్నాడు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఖాళీగా ఉంటాడో తెలియదు కాబట్టి.. సమయం దొరికినప్పుడల్లా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని క్రిష్ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.దీంతో క్రిష్ ప్లానింగ్ అదుర్స్ అంటున్నారు పలువురు విశ్లేషకులు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: