సీఎం జగన్ కు పవన్ ప్రశంస.. టీడీపీకి షాకిచ్చేనా?

Murali

గత సార్వత్రిక ఎన్నికల నుంచే కాదు.. 2014 ఎన్నికల సమయం నుంచీ జనసేనకు, వైసీపకి సఖ్యత లేదు. రాజకీయంగా శత్రువులుగానే మెలిగారు పవన్ కల్యాణ్ – జగన్మోహన్ రెడ్డి. 2019కి ముందు వీరిద్దరూ ప్రత్యర్ధులుగా తలపడ్డ వైనం ఎవరూ మర్చిపోలేనిది. జగన్ ఓ అడుగు ముందుకేసి పవన్ ను వ్యక్తిగతంగా విమర్శించారు. కానీ.. పవన్ రాజకీయంగానే విమర్శలు చేశారు. అదంగా 2019 ఎన్నికల ఫలితాల ముందు కథ. ఆ ఎన్నికల్లో వైసీపీ విజయదుందుభి మోగించడం జగన్ ఆంధ్రప్రదేశ్ సీఎం కావటం జరిగింది. అయితే.. ఈ ఆరేళ్లలో ఎప్పుడే జరగని అద్భుతం ఇప్పుడు జరిగింది.

 

రాజకీయ ప్రత్యర్ధి సీఎం జగన్ ను జనసేన అధినేత ప్రశంసించడం ఇప్పుడు స్టేట్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. జగన్ ఈనెల 2న ఘనంగా ప్రారంభించిన 108, 104 సేవల్ని, కరోనా సమయంలో ప్రభుత్వం చేసిన టెస్టులను ప్రశంసించడం రాజకీయవర్గాలనే కాదు.. వైసీపీ నేతలనే ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ‘ప్రభుత్వం మంచి పనులు చేస్తే హర్షిస్తాం.. వారి పాలసీలు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే ప్రశ్నిస్తాం’ అని గతంలో పవన్ చెప్పాడు. ఇప్పడు పవన్ చేస్తోందిదే. కరోనా టెస్టుల విషయంలో జగన్ సర్కార్ ఎప్పటినుంచో ప్రశంసలు అందుకుంటోంది. ఆంబులెన్సులు ఈస్థాయిలో ప్రతి మండలానికి ఒకటి ఏర్పాటు చేయడం విశేషం.

 

పవన్ ఈ విధంగా ప్రభుత్వాన్ని మెచ్చుకోవడం టీడీపీకి కూడా మింగుడుపడనిదే. ఇంత డైరక్ట్ గా టీడీపీ అధికారంలో ఉండగా చంద్రబాబను కూడా జరగలేదు. అయితే.. ఎప్పుడైనా వ్యవస్థలపై మాట్లాడాల్సినప్పుడు పవన్ ఈ మెసేజ్ గురించి ప్రస్తావించే అవకాశం ఉంది. మంచి చేస్తే మెచ్చుకున్నాను.. మీరు గమనించాలి.. అనే అవకాశం ఉంది. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ  విమర్శలు చేసింది. పవన్ నిర్మాణాత్మక పాత్ర పోషించి మన్ననలు అందుకుంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: