రిటైర్ మెంట్ ప్రకటించిన స్టార్ రెజ్లర్ అండర్టేకర్...?

praveen

వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా భారతదేశంలో అయితే ఈ వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ కు విపరీతమైన అభిమానులు ఉన్నారు. టెన్ స్పోర్ట్స్ లో వచ్చే ఈ  ఎంటర్టైన్మెంట్ షో కి భారీ రేంజ్ లో అభిమానులు ఉన్నారు. ఇక ఇందులో ప్రతి రెజ్లర్ ని కూడా ఎంతో అమితంగా ఆరాధిస్తూ ఉంటారు ప్రేక్షకులు. అయితే వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ అనేది ఒక స్క్రిప్టెడ్  షో అని తెలిసినప్పటికీ కూడా... డబ్ల్యూ డబ్ల్యూ ఈ కి  మాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కడా తగ్గలేదు. ముఖ్యంగా హాలీవుడ్ సినిమాలకు సంబంధించిన హీరోలందరూ ఇక్కడి నుంచి వస్తూ ఉండడం కూడా మరింత క్రేజ్  సంపాదించుకుని ఈ షో. 

 


 అయితే వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ కు ప్రఖ్యాత రెజ్లర్  అయినా ది అండర్ టేకర్ రిటైర్మెంట్ ప్రకటించారు. దాదాపు ముప్పై ఏళ్లుగా ఇదే ఫీల్డ్ లో కొనసాగుతున్నారు ది అండర్ టేకర్ . ది లాస్ట్  రైడ్  డాక్యు  సిరీస్ చివరి ఎపిసోడ్ వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తూన్నట్లు వెల్లడించారు ది అండర్ టేకర్. నేను మరో సారి రెస్లింగ్ రింగ్ లోకి అడుగు పెట్టాలని కోరిక లేదు.. నేను గెలవడానికి ఏమీ లేదు... నేను సాధించడానికి కూడా ఏమీ లేదు.. ప్రస్తుతం ఆటతీరు ఎంతగానో మారింది కొత్తవారు రావడానికి ఇదే సరైన సమయం. ఈ డాక్యుమెంటరీ నాకు చాలా సహాయం చేసింది  అని భావిస్తున్నాను అంటూ అండర్ టేకర్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ రెజ్లింగ్ లో తన ప్రయాణం ముగిసింది అంటూ పేర్కొన్నారు. 

 


 అంతే కాకుండా అటు డబ్ల్యూ డబ్ల్యూ ఈ నెట్వర్క్ కూడా అండర్ టేకర్  రిటైర్మెంట్పై సోషల్ మీడియా వేదికగా పలు పోస్టులు చేసింది. అండర్ టేకర్  కు సంబంధించిన పలు ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్ గా మారిపోయాయి. ఇక అండర్ టేకర్  రిటైర్మెంట్ ప్రకటించడం తో ఆయన అభిమానులందరూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ జట్టు సోషల్ మీడియాలో స్పందించింది. ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ వరల్డ్ హెవీవెయిట్ చాంపియన్షిప్ ఉన్న ఫోటోని  ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. థాంక్యూ టేకర్ అంటూ ఒక కామెంట్ పెట్టారు. ఇక మరి ఎంతో మంది అభిమానులు కూడా ఇన్ని రోజులు ఎంటర్టైన్మెంట్ పంచినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: