తండ్రి వారసత్వాన్నే కాదు, నటనను కూడా పుణికి తెచ్చుకున్న రావు రమేష్..?

praveen

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో తండ్రుల వారసత్వాన్ని కొనసాగిస్తూ రాణిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. కేవలం హీరోలుగా మాత్రమే కాకుండా కమెడియన్స్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా తమ సినీ ప్రముఖులు వారు తమదైన ప్రత్యేకతని కొనసాగిస్తూ ఎంత గుర్తింపు సంపాదించుకున్న వారు ఉన్నారు . ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో గుర్తింపు సంపాదించుకున్న క్యారెక్టర్ ఆర్టిస్టులలో ఒకరు  రావు రమేష్. తెలుగు చిత్ర పరిశ్రమలో రావు రమేష్ నటనకు ఫిదా అవని తెలుగు ప్రేక్షకుడు లేడు  అనడంలో అతిశయోక్తి లేదు. ఎంతో వైవిధ్యమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు రావు రమేష్. 

 

 ఎలాంటి పాత్రలోనైనా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి పాత్రకు ప్రాణం పోయే గలరు రావు రమేష్. ఆయన నటించిన అన్ని పాత్రలు కూడా తెలుగు ప్రేక్షకులకు మదిలో నిలిచి పోతూ ఉంటాయి. అయితే ఒకప్పుడు ఎంతో వైవిధ్యమైన నటనతో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా... కమెడియన్గా ఎంతగానో గుర్తింపు సంపాదించుకుని  విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగించిన రావు గోపాలరావు వారసుడు ఈ రావు రమేష్. అప్పట్లో రావు గోపాలరావు నటనకు ఎన్నో అవార్డులు రివార్డులు సైతం వచ్చిన విషయం తెలిసిందే. 

 


 అయితే రావు గోపాలరావు నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు రావు రమేష్. రావు రమేష్ కేవలం వారసుడిగా నే కాకుండా తండ్రి నటన ను  కూడా పుణికి  తెచ్చుకున్నాడు అని చెప్పాలి. ఆనాడు తండ్రి తన వైవిధ్యమైన నటనతో ఎంతగా తెలుగు ప్రేక్షకులను అలరించారో  ఈనాడు తనయుడు రావు రమేష్ కూడా తన అద్భుతమైన  నటనతో పాత్రలకు ప్రాణం పోస్తు ఎంతగానో గుర్తింపు సంపాదించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న క్యారక్టర్ ఆర్టిస్టులలో ఎక్కువ క్రేజ్ ఉన్న నటుడు  రావురమేష్ అనడంలో అతిశయోక్తి లేదు, ప్రతి పాత్రలో  రావు రమేష్ ఒదిగిపోయి నటించిన తీరు నిజంగా సినిమా చూస్తున్న ప్రేక్షకుల మదిని మైమరిపింప  చేస్తుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: