టాలీవుడ్ లో నెంబర్ స్థానాన్ని అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు. ఒక్క సినిమాతో తన ఇమేజ్ను తారా స్థాయికి తీసుకు వచ్చిన మహేష్, కామెడీ విషయంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు. ఎక్కువగా హీరో ఓరియంటెడ్ యాక్షన్ చిత్రాలు మాత్రమే చేసిన మహేష్ బాబు అడపాదడపా కామెడీ సినిమాలు కూడా ట్రై చేశాడు. తన మార్క్ యాక్షన్ హీరోయిజం మిస్ కాకుండానే కామెడీ సినిమాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఆ ప్రయత్నాల్లో దారుణంగా ఫెయిల్ అయ్యాడు మహేష్.
ఈ లిస్ట్‌లో ముందుగా చెప్పుకోవాల్సిన సినిమా ఖలేజా. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ కు జోడిగా అనుష్క నటించింది. మహేష్ బాబును ఏకంగా దేవుడిగా చూపించిన త్రివిక్రమ్ థియేటర్లలో ఆడియన్స్‌ను మెప్పించలేకపోయాడు. అప్పటి వరకు యాక్షన్ చిత్రాలు మాత్రమే చేసిన మహేష్ బాబు ఒక్కసారిగా ఫుల్ టర్న్ తీసుకొని కామెడీ చేసే సరికి ఆయడిన్స్ యాక్సెప్ట్ చేయాలేకపోయారు. దీంతో ఖలేజా సినిమా డిజాస్టర్ అయ్యింది తరువాత అదే సినిమా టీవీలో ప్రసారమైతే మాత్రం జనం ఎగబడి చూశారు.
ఇక కామెడీతో మహేష్ ఫెయిల్ అయిన మరో సినిమా ఆగడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన దూకుడు సినిమాలో మహేష్ కామెడీ చేసిన ఎక్కువగా యాక్షన్, సెంటిమెంట్ ఉండటంతో ఆ సినిమా హిట్ అయ్యింది. అదే సెంటిమెంట్‌ను కంటిన్యూ చేస్తూ చేసిన ఆగడు కామెడీ ఓవర్ డోస్ అయ్యే సరికి ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. దీంతో ఆగడు మహేష్ కెర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా ప్రభావం మహేష్ బాబు మీద ఏ స్థాయిలో పడిందట, ఆ తరవుాత కామెడీ సినిమా అంటేనే మహేష్ భయపడ్డాడు. అయితే ఈ లాజిక్‌ను బ్రేక్ చేసిన సినిమా సరిలేరు నీకెవ్వరు. లాంగ్ గ్యాప్ తరువాత అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బ్లాక్ బస్టర్ హిట్ తో సత్తా చాటాడు.
మరింత సమాచారం తెలుసుకోండి: