ఆర్ ఆర్ ఆర్ లోని డబల్ కంటెంట్ ను బయటపెట్టిన విజయేంద్రప్రసాద్ !
‘బాహుబలి’ సినిమాను రాజమౌళి మొదలు పెట్టిన్నప్పుడు ఆ సినిమాను జక్కన్న రెండు భాగాలుగా తీస్తాడని ఎవరు ఊహించలేదు. ఆమూవీ బడ్జెట్ భారీగా పెరిగిపోవడంతో పాటు ఆమూవీ కథ కూడ బాగా పెరగడంతో ‘బాహుబలి’ ని రెండు భాగాలుగా జక్కన్న తీసాడు.
అయితే ‘బాహుబలి’ పార్ట్ వన్ లో చివరిన రాజమౌళి ఇచ్చిన ట్విస్ట్ తో ‘బాహుబలి’ పార్ట్ 2 పై విపరీతమైన అంచనాలు పెరిగి బాహుబలి పార్ట్ 2 విడుదల ఆలస్యం అయినా ఆ మూవీ పై ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఇప్పుడు ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి కూడ బడ్జెట్ విపరీతంగా పెరిగిపోవడంతో ఈమూవీని కూడ రాజమౌళి రెండు భాగాలుగా తీస్తున్నాడు అంటూ ఈమధ్య ఇండస్ట్రీలో తెగ పుకార్లు మొదలు అయ్యాయి.
ఇలాంటి పరిస్థితులలో ఈమధ్య ఒక ఎఫ్ ఎమ్ రేడియోకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చిన విజయేంద్ర ప్రసాద్ కు ఆ ఇంటర్వ్యూను నిర్వహించే రేడియో జాకీ నుండి ఒక విచిత్ర ప్రశ్న ఎదురైంది. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీని కూడ రాజమౌళి రెండు భాగాలుగా తీస్తున్నాడా అంటూ అడిగిన ప్రశ్నకు విజయేంద్ర ప్రసాద్ ఆశ్చర్యకర సమాధానం ఇచ్చాడు.
ఈ సినిమాను రాజమౌళి సింగిల్ పార్ట్ గానే తీస్తున్నాడని అంటూ అయితే ఈ మూవీలో డబల్ కంటెంట్ ఉంటుంది అన్న క్లారిటీ ఇచ్చాడు. దీనితో కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్న జూనియర్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న చరణ్ పాత్రలను వేరువేరుగా చూపెడుతూ ఒకచోట వీరిద్దరినీ కలిపినా వీరిద్దరి కథలు వేరువేరుగా చూపెడుతూ ఒకే సినిమాలో రెండు సినిమాలు చూపెడుతూ రాజమౌళి ఒక సరికొత్త ప్రయోగం చేయబోతున్నాడు అన్నసంకేతాలు వస్తున్నాయి. ఇలా విజయేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇవ్వడానికి ఒక కారణం ఉంది. ఇప్పటికే జూనియర్ చరణ్ ల అభిమానులు తమ హీరోల పాత్రలు ఏమాత్రం తగ్గకూడదు అని కోరిన నేపధ్యంలో రాజమౌళి విజయేంద్ర ప్రసాద్ ద్వారా ఈ క్లారిటీ ఇప్పించి ఉంటాడు..