టాలీవుడ్ హీరో కూతురు ఎఫైర్... కంట్రోల్ తప్పేసిందా...!
సినిమా ఇండస్ట్రీలో ఎఫైర్ అనేది చాలా కామన్. కొన్ని ప్రేమ కథలకు ఆరంభంలోనే ఎండ్ కార్డ్ పడితే... మరి కొన్ని ప్రేమకథలు పెళ్లి వరకు వెళుతూ ఉంటాయి. మరికొందరు ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. తాజాగా హీరో కూతురు ప్రేమలో పడిందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందిన ఆయన ఇప్పటకీ హీరోగా సినిమాలు చేస్తున్నాడు. తన కూతుళ్లను హీరోయిన్లుగా నిలబెట్టే ప్రయత్నాలు ప్రారంభించాడు.
ఆల్రెడీ ఒక అమ్మాయి హీరోయిన్గా సినిమా చేసింది. మరో అమ్మాయిని హీరోయిన్ చేసే ప్రయత్నాల్లో బిజీబిజీగా ఉన్నాడు. ఈ అమ్మాయి నటించిన సినిమా షూటింగ్ ప్రారంభమై కూడా మధ్యలో ఆగిపోయింది. అయితే ఇప్పుడు ఈ కాబోయే హీరోయిన్ ఓ యువ హీరో తో ప్రేమాయణం నడుపుతోందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఆ హీరో చేతిలో సినిమాలు లేవు. అయితే ఆ మధ్య బిగ్ బాస్ షో కి వెళ్లి తన ఆవేశంతో కాస్త పాపులారిటీ తెచ్చుకున్నాడు. అయినా ఆ హీరోకు సినిమా అవకాశాలు ఎంత మాత్రం రాలేదు.
అయితే సదరు హీరో ఆ సీనియర్ హీరో గారి కూతురు ని ప్రేమలో దింపడంలో మాత్రం సక్సెస్ అయినట్లు టాక్. ఈ ప్రేమ విషయం కాబోయే హీరోయిన్ ఇంట్లో గొడవలు మొదలైనట్లు తెలుస్తోంది. కెరీర్లో ఇంకా సెటిల్ కాకముందే ఇలా ప్రేమ దోమ అంటూ పిచ్చి వేషాలు ఎందుకని ఆ కాబోయే హీరోయిన్ తల్లిదండ్రులు వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. ఇంతకీ ఆ కాబోయే హీరోయిన్ తల్లిదండ్రులది ప్రేమ పెళ్లి అయినా... తమ కుమార్తె ప్రేమ లోకి దిగితే ఎక్కడ ఆమె కెరియర్ ఇబ్బందుల్లో పడుతుందో అన్న ఆందోళనలో వారిద్దరు ఉన్నారట, అయితే ఆ కాబోయే హీరోయిన్ మాత్రం అవేమి పట్టించుకోవడం లేదట. మరి ఈ ప్రేమ వ్యవహారం ఎక్కడ వరకు వెళుతుందో ? చూడాలి.