కాంచన గా ఫస్ట్ లుక్ లో అదరగొట్టాడు ....!!

Mari Sithara
బాలీవుడ్ సంచలన నటుడిగా పేరుగాంచిన అక్షయ్ కుమార్ ఇటీవల కొన్నాళ్లుగా కొంత విభిన్న తరహా సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు. ఆ విధంగా కొన్నాళ్ల క్రితం ఆయన నటించిన ప్యాడ్ మ్యాన్, ఓహ్ మై గాడ్, గోల్డ్ వంటి సినిమాలు మంచి విజయాలు అందుకోవడం జరిగింది. అంతేకాక తాను చేసే సినిమాలు సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడాలని ఎక్కువగా ఆలోచన చేసే అక్షయ్, ప్రస్తుతం మరొక విభిన్న తరహా క్యారెక్టర్ లో నటిస్తున్నారు. 

గతంలో రాఘవ లారెన్స్ హీరోగా తెరకెక్కిన కాంచన సినిమా తెలుగు మరియు తమిళ భాషల్లో ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. హర్రర్ కథాంశంతో తెరకెక్కిన ముని అనే సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాలో లారెన్స్ హీరోగా నటించగా ప్రముఖ తమిళ నటుడు శరత్ కుమార్, కాంచన అనే హిజ్రాగా నటించి ప్రేక్షకులందరితో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకోవడం జరిగింది. అయితే అదే సినిమాను ప్రస్తుతం హిందీలో లక్ష్మి బాంబ్ పేరుతో లారెన్స్ తెరకెక్కిస్తుండగా, అందులోని హిజ్రా పాత్రలో అక్షయ్ నటిస్తున్నారు. 

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలోని అక్షయ్ కుమార్ పాత్ర తాలూకు ఫస్ట్ లుక్ కాసేపటి క్రితం సోషల్ మీడియా మాధ్యమాల్లో రిలీజ్ చేసారు సినిమా యూనిట్. ఆ పోస్టర్ లో అక్షయ్ ఎరుపురంగు చీరతో ఎంతో ఉక్రోషంతో కాళికా మాత ప్రక్కన నిలబడి ఉండడం గమనించవచ్చు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను కేప్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్, తుషార్ ఎంటర్టైన్మెంట్ హౌస్, షబీనా ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తుండగా, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంస్థ దీని రిలీజ్ హక్కులను కొనుగోలు చేయడం జరిగింది. వచ్చే ఏడాది మేలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై బాలీవుడ్ వర్గాల్లో మంచి అంచనాలు ఉన్నాయి....!! 
Navratri is about bowing to the inner goddess and celebrating your limitless strength.On this auspicious occasion,I am sharing with you my look as Laxmmi.A character I am both excited and nervous about... but then life begins at the end of our comfort zone...isn’t it? #LaxmmiBomb pic.twitter.com/TmL9U1OXdk

— Akshay Kumar (@akshaykumar) October 3, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: