భవిష్యత్తులో అటువంటి క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ చేయవచ్చు అంటున్న నాగబాబు..!
ఇటీవల సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తారా అని నెటిజన్లు నాగబాబుని ప్రశ్నించారు. దీనికి సమాధానం ఇస్తూ.. పవన్ కళ్యాణ్ ఇక సినిమాలు చేయడం కుదరదు. బహుశా మేము కోరితే గెస్ట్ రోల్స్ లో నటించే అవకాశం ఉంది. అన్నయ్య చిరంజీవి రాజకీయాలు వద్దనుకుని తిరిగి సినిమాల్లోకి వచ్చేశారు. కానీ పవన్ అలా కాదు.. రాజకీయాల్లోని ఉండాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు అని నాగబాబు తెలిపారు.
నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన నాగబాబు ఓటమి చెందారు. తన రాజకీయ ప్రయాణం పవన్ కళ్యాణ్ తోనే కొనసాగుతుందని నాగబాబు క్లారిటీ ఇచ్చారు. తన గురించి వస్తున్న పుకార్లన్నింటికీ కార్యాచరణతోనే పవన్ సమాధానం ఇవ్వాలి.