‘గ్యాంగ్ లీడర్’రిమేక్ లో రాంచరణ్?!

siri Madhukar
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ నటించిన కొన్ని సినిమాలో ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయే విధంగా ఉన్న విషయం తెలిసిందే. అందులో ఖైదీ, చంటబ్బాయ్, రుద్రవీణ, గ్యాంగ్ లీడర్ ఇలా కొన్ని సినిమాలు ఉన్నాయి.  అయితే చిరంజీవి  కెరీర్‌లో `గ్యాంగ్ లీడ‌ర్‌` సినిమాది ఒక ప్ర‌త్యేక స్థానం. అద్భుత‌మైన టైమింగ్‌తో మాస్ హీరోగా చిరంజీవి న‌టించిన ఈ సినిమా ఘ‌నవిజయాన్ని అందుకుంది. విజ‌య‌బాపినీడు ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు. ఈ సినిమాలో విజయశాంతి కూడా చిరంజీవితో పోటీ పడి మరీ నటించింది. 

ప్రస్తుతం పాత సినిమా పేర్లతో కొత్త సినిమాలు వస్తున్న విషయం తెలిసిందే. చిరంజీవి కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయిన ఈ సినిమా రీమేక్‌లో రామ్‌చ‌ర‌ణ్ న‌టించ‌బోతున్న‌ట్టు ఎప్ప‌ట్నుంచో వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ మద్య సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.  రాంచరణ్ తన తదుపరి సినిమా రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో కలిసి మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్నాడు.  మరోవైపు బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. 

ఇదిలా ఉంటే..`గ్యాంగ్ లీడ‌ర్‌` సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్నాడ‌నేది ఇప్ప‌టివ‌ర‌కు వార్త‌ల‌కే ప‌రిమిత‌మైంది. అయితే త్వ‌ర‌లో ఆ వార్త నిజం కాబోతున్న‌ట్టు స‌మాచారం. సినీయ‌ర్ నిర్మాత కేయ‌స్ రామారావు నిర్మాణంలో చెర్రీ ఓ సినిమాలో న‌టిస్తాడ‌ని ఇటీవ‌ల ఓ వేడుక‌లో చిరంజీవి చెప్పిన సంగ‌తి తెలిసిందే. సో...బోయపాటి, రాజమౌళి సినిమాల తర్వాత చెర్రీ నటించబోయే సినిమా ‘గ్యాంగ్ లీడర్’ రీమేకేన‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ జ‌నాలు అనుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: