బిగ్ బాస్ కాంట్రవర్సీ క్వీన్ తో ప్రభాస్ అసహనంలో అభిమానులు !

Seetha Sailaja

 

‘బాహుబలి’ తో ఇండియన్ సెలెబ్రెటీగా మారిపోయిన ప్రభాస్ మ్యానియా దేశ వ్యాప్తంగా కనిపిస్తోంది. ఎందరో బాలీవుడ్ నిర్మాతలు దర్శకులు ప్రభాస్ ముందు క్యూ కడుతున్న నేపధ్యంలో ప్రభాస్ బాలీవుడ్ స్టార్ గా మారడం ఖయాం అని అనిపిస్తోంది. దీనితో ‘సాహో’ తరువాత ప్రభాస్ బాలీవుడ్  మూవీ ఉంటుంది అన్న ప్రచారం జరుగుతోంది.

 

ఇది ఇలా ఉండగా ప్రభాస్ సినిమాలో హీరోయిన్‌గా నటించేందుకు బిగ్‌బాస్ 11 సెలబ్రిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వస్తున్న వార్తలు ప్రభాస్ అభిమానులకు అసహనాన్ని కలిగిస్తున్నాయి.  బిగ్‌బాస్‌11లో క్వీన్ ఆఫ్ కాంట్రవర్సీగా అరుషి ఖాన్‌కు పేరుంది. వివాదాస్పద సంఘటనల కారణంగా అరుషి ఆ రియాల్టీ షో నుంచి మధ్యలోనే ఎలిమినేట్ అయింది.

 

అయితే ఆ తర్వాత అనేక వివాదాస్పద అంశాలలో అనేక సార్లు ఆమె పేరు వినిపించింది అటువంటి హాట్ బ్యూటీ లేటెస్ట్ గా చేసిన ట్విట్ ప్రభాస్ అభిమానులను గందరగోళంలో పడేస్తోంది.  తాను ఓ ప్రతిష్ఠాత్మక చిత్రంలో నటించేందుకు ఒప్పుకొన్నాను. బాహుబలి స్టార్ ప్రభాస్ సరసన నటిస్తున్నాను అని ట్వీట్ చేసింది. ‘Arshi Khan @ArshiKOfficial #ArshiKhan signed on for a big film in main lead starring mega star Prabhas. Thank you @BeingSalmanKhan @ColorsTV @EndemolShineIND @BiggBoss @rajcheerfull #AbhishekRege Special thanks to #NevadaPutman’ అంటూ ట్విట్ చేసింది.

 

అంతేకాదు తనకు బిగ్ బాస్ షో వల్ల ఏర్పడిన క్రేజ్ వల్ల తనకు ప్రభాస్ తో నటించే చాన్స్ వచ్చింది అని చెపుతూ దీనికి సహాయం చేసిన సల్మాన్ ఖాన్‌ కు ధన్యవాదాలు అంటూ ఈమె చేసిన ట్వీట్‌ ప్రభాస్ అభిమానులను మరింత కలవర పెడుతోంది. దీనితో ప్రభాస్ పక్కన అరుషీని ఎలా ఊహించుకోగలం అంటూ అభిమానులు అసహనానికి లోనవుతున్నారు. దీనితో ప్రభాస్ తో ఈమె నటించబోతున్నది ‘సాహో’ సినిమాలోనా లేదంటే ప్రభాస్ భవిష్యత్ లో నటించబోయే హిందీ సినిమాలోనా అనే సందేహాలు ప్రభాస్ అభిమానులను ప్రస్తుతం వెంటాడుతున్నాయి


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: