అక్కినేనినాగార్జున నిన్న తన పిల్లలు నాగచైతన్య అఖిల్ ల పెళ్ళి విషయంలో మరో ట్విస్ట్ ఇచ్చాడు. ఈమధ్య ‘నిర్మలా కాన్వెంట్’ మూవీ ప్రమోషన్ ఫంక్షన్ లో మీడియా వర్గాలు నాగార్జునను నాగచైతన్య పెళ్ళి విషయమై ప్రశ్నించినప్పుడు మంచిరోజు చూసుకుని అన్ని విషయాలు తానే మీడియాకు చెపుతాను అని చెప్పిన విషయం తెలిసిందే.
అయితే ఇంతలో ఏమైందో తెలియదు కానీ నాగార్జున చైతూ గురించి మాట్లాడకుండా అఖిల్ మ్యారేజ్ ఎంగేజ్మెంట్ డేట్ అనోన్స్ చేసాడు. డిసెంబర్ 9న అఖిల్ తాను ప్రేమిస్తున్న శ్రీయ భూపాల్ తో మ్యారేజ్ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ లో ఉంగరాలు మార్చుకోబోతున్న విషయాన్ని బయట పెట్టాడు.
ఇదే సందర్భంలో నాగచైతన్య ఇంకా పెళ్ళికి రెడీ కాలేదని అతడు ఎప్పుడు లైన్ క్లియర్ చేస్తే అప్పుడే పెళ్ళి ముహూర్తం అని అంటూ చైతూ సమంతల పెళ్ళి విషయమై మరోసారి తన సస్పెన్స్ కొనసాగించాడు. దీనితో నాగ్ నోటి వెంట ఈ అనౌన్స్ మెంట్ విన్న వారి మైండ్ బ్లాంక్ అయింది.
ఇప్పటికే నాగాచైతన్యా సమంతల ప్రేమ వ్యవహారం ఓపెన్ సీక్రెట్ గా మారిన నేపధ్యంలో నాగార్జున చైతన్య విషయాన్ని పక్కకు పెట్టి అఖిల్ విషయాన్ని ఎందుకు ముందుకు తెచ్చాడు అన్న విషయం సమాధానాలు లేని ప్రశ్నగా మారింది. అంతేకాదు అ మధ్య మీడియాలో చైతన్య సమంతల జాతకాలలో కొన్ని సమస్యలు ఉన్నాయి అని నాగార్జున దృష్టికి వచ్చింది అన్న నేపధ్యంలో నాగ్ ఆ జాతక సమస్యల పరిష్కారానికి పరిహారాలు చేయిస్తూ ఉండటంతో ఈ ఆలస్యం జరుగుతోందా ? అన్న అనుమానాలు కూడ వ్యక్తం అవుతున్నాయి.
ఇది ఇలా ఉండగా అఖిల్ వయస్సు ఇప్పుడు కేవలం 22 సంవత్సరాలు మాత్రమే అయిన నేపధ్యంలో నాగార్జున తన పెద్ద కొడుకు చైతన్య పెళ్ళి గురించి కాకుండా ముందు అఖిల్ పెళ్ళి గురించి ఎందుకు ఖంగారు పడుతున్నాడు అన్నది కూడ సస్పెన్స్ గానే కొనసాగుతోంది. నాగార్జునకు సెంటిమెంట్ రీత్యా అన్ని విధాల బాగా కలిసి వచ్చే డిసెంబర్ నెలలో అఖిల్ ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేయడం వెనుక కూడ ఈ సెంటిమెంట్ ప్రభావం ఉందా అని అనిఅనిపించడం సహజం.
ఏది ఎమైనా నాగ్ తన వ్యూహాత్మక ఎత్తుగడలతో ఇంకా సమంత నాగాచైతన్యాల విషయంలో సినిమా సస్పెన్స్ మాదిరిగా ఎదో ఒక ట్విస్ట్ ఇవ్వడానికి ఇంకా ప్రయత్నిస్తునట్లుగానే కనపడుతోంది..