మనీ: పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే.. ఇలా చేయాల్సిందే..!!

Divya
చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు.అయితే వారి వయసు పెరిగే కొద్దీ చదువు రీత్యా ,వివాహ రిత్యా విషయాల పైన ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు.. ఇలాంటప్పుడు విభిన్నమైన పెట్టుబడి ప్రణాళికల గురించి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. పెట్టుబడి అనేది మంచి రాబడిని ఇస్తుందని అలాగే వారి లక్ష్యాలను చేరుకోవడంలో కూడా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.. ఈ నేపథ్యంలోనే ఉత్తమ పెట్టుబడులు పిల్లల భవిష్యత్తుకు చాలా అవసరం దాదాపుగా కోటి వరకు కార్పోస్ ఫండ్ నిర్మించవచ్చు.

1). అధిక రాబడి పొందాలి అంటే కచ్చితంగా రియల్ ఎస్టేట్ మంచి అవకాశం అని చెప్పవచ్చు. మెరుగైన దీర్ఘకాలిక అవకాశాలు ఉన్న ఆస్తిలో 25 లక్షల మొత్తం పెట్టుబడి పెట్టడం వల్ల ఆ ఆస్తి విలువ వృద్ధిరేటు పెరగడంతో ఏడాదికి 10 శాతం చొప్పున పెరగడంతో 15 సంవత్సరాలకు కోటి రూపాయల వరకు వస్తుంది.
2). ఫిక్స్డ్ డిపాజిట్లు చాలా సురక్షితమైనవి.. ఇది సౌకర్యవంతమైన వ్యవధిలోని రాబడతాయి.. బ్యాంకు ఫిక్స్ డిపాజిట్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ సహ వివిధ ఎంపికలను ఆశ్రయించుకోవచ్చు.. ఇది 6 నుంచి 10 శాతం మధ్య వడ్డీ రేట్లు అందిస్తాయి..

3). బీమా పథకాలు కూడా పిల్లల భవిష్యత్తుకు మంచి సహకారాన్ని అందిస్తాయి. బీమా చేసే వ్యక్తి అకాల మరణం చెందితే పిల్లలకు ఈ డబ్బు సైతం అందుతుంది దీంతోపాటు పన్ను ప్రయోజనాలు ఇతర త్రవాటివి పొందవచ్చు..

4). మ్యూచువల్ ఫండ్స్ లో దీర్ఘకాలా సంపదలో పెట్టుబడి పెడితే అవి అధిక రాబడిన సైతం అందిస్తాయి.. మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్, డేట్ ఫండ్స్ ఇతరత్రా అనేక రకాల వాటిలో పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి లాభాలు అందిస్తాయి.. కనీసం ప్రతినెల 12 వేలకు పైగా స్మాల్ క్యాప్ ఫండ్ పెట్టుబడులు పెడితే 15 సంవత్సరాలకు కోటి రూపాయల వరకు అందుకోవచ్చు.

బంగారు ధరలు అప్పుడప్పుడు తగ్గినట్టుగా కనిపించిన ధర మాత్రం పెరుగుతూ కనిపిస్తుంది.. చాలామంది బంగారు పెట్టుబడిల పైన మంచి రాబడిన పొందుతున్నారు.. వీటి వల్ల కూడా పిల్లలకు ఉపయోగించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: