మనీ: ఇప్పటివరకు అర్హత ఉండి సంక్షేమ పథకాల ద్వారా డబ్బు అందని వారికి శుభవార్త..!!
ఇకపోతే లబ్ధిదారుల ఖాతాల్లో సుమారుగా రూ.137 కోట్ల రూపాయలను జమ చేయనున్నారు. ఈరోజు సుమారుగా 9,30,809 మంది అర్హులైన లబ్ధిదారులకు నేరుగా వారి ఖాతాలోని వివిధ పథకాల కింద 137 కోట్ల రూపాయలను జమ చేస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇకపోతే ఇప్పటికే అర్హులై ఉండి డబ్బు పొందని వారు మీ ఖాతాలను మరొకసారి చెక్ చేసుకోగలరు. ఇదిలా ఉండగా భద్రాచలం వంటి కోస్తా ఆంధ్ర ప్రాంతాలు నీట మునిగిన నేపథ్యంలో వరద తగ్గుముఖం పట్టిన వెంటనే పది రోజులలో పంట , ఆస్తి నష్టాలపై అంచనాలు పూర్తి చేయాలి అని అధికారులకు ఆదేశించారు.
ఇక ఆ తర్వాత రైతులకు తగినంత నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉందని ఆయన ఈరోజు ప్రకటించడం జరిగింది. ఇకపోతే ప్రస్తుతం వారికి 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళదుంపలు, కేజీ పామాయిల్ .. వచ్చే 48 గంటల్లో అందజేయాలి అని అధికారులకు స్పష్టం చేశారు. ఇకపోతే ముంపుకు గురైన ప్రతి గ్రామంలో పంపిణీ ముమ్మరం చేయాలి అని కలెక్టర్, సీనియర్ అధికారులు దీన్ని సవాల్ గా తీసుకోవాలని సీఎం జగన్ కోరారు.