'పుష్ప2' కోసం మరో పవర్ ఫుల్ విలన్..?

Anilkumar
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప' చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని  అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో బన్నీ దేశవ్యాప్తంగా ఎంతో పాపులారిటీని దక్కించుకున్నాడు. పాన్ ఇండియా హిట్ గా నిలిచిన ఈ సినిమాతో అల్లు అర్జున్ ఏకంగా ఐకాన్ స్టార్ గా మారిపోయాడు. ఇక ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్ గా కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ ని కనబరిచాడు. ఇక అతని సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్గా నటించిగా, కమెడియన్ సునీల్, అనసూయ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించారు. ఇక సినిమా చివర్లో ఎంట్రీ ఇచ్చిన ఫహాద్ ఫాజిల్ పార్ట్ 2 లో మెయిన్ విలన్ గా కనిపించనున్నాడు.

తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. బాలీవుడ్ లో అయితే ఈ సినిమా 100 కోట్ల మార్క్ ని టచ్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. ఇక పార్ట్ వన్ పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అవడంతో పుష్ప 2 లో అనేక మార్పులు చేర్పులు చేస్తున్నారు. మొదటి భాగంలో ఓ సాధారణ కూలి ఎర్రచందనం సిండికేట్ గా ఇలా ఎదిగాడు అనే అంశాన్ని చూపించారు. ఇప్పుడు రెండో భాగంలో ఎదిగిన తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? అనేది చూపిస్తారు. ఈ క్రమంలోనే పుష్ప2 కోసం ఇప్పుడు మరో పవర్ఫుల్ విలన్ రంగంలోకి దింపబోతున్నట్లు సమాచారం వినిపిస్తోంది. ఆ పవర్ ఫుల్ విలన్ మరెవరో కాదు..

బాలయ్య లెజెండ్ సినిమాతో విలన్ గా మారిన జగపతిబాబు ఇప్పుడు పుష్ప టు లో విలన్ గా కనిపించబోతున్నాడు. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తండ్రి పాత్రలు చేస్తున్నా.. విలన్ గా జగపతిబాబు కి మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే మలయాళ, తమిళ ఇండస్ట్రీ నుంచి విలన్ గా ఆయనకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇక ఇప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సైతం జగపతిబాబుని విలన్ గా రంగంలోకి దించబోతున్నాడట. పుష్ప పార్ట్ 2 లో జగపతిబాబు కోసం పవర్ఫుల్ పాత్రను సుకుమార్ సిద్ధం చేసినట్లుగా ఫిలిం సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. పార్ట్ 2 లో ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి లతోపాటు జగపతిబాబు కూడా విలన్ గా కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు దీనిపై ఎటువంటి అధికారిక సమాచారం లేనప్పటికీ ఫిలిం సర్కిల్స్ లో ఈ వార్త జోరుగా ప్రచారం అవుతుంది. త్వరలోనే దీనిపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: