విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమా సస్పెన్స్!!

P.Nishanth Kumar
విజయ్ దేవరకొండ హీరోగా ఇప్పుడు ఒకే ఒక సినిమా రూపొందుతుంది అని చెప్పాలి. ఎన్నో అంచనాలు పెట్టుకుని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన లైగర్ సినిమా వారిని ఏమాత్రం ఆదరించకపోవడంతో కొంత ఢీలా పడ్డ విజయ్ దేవరకొండ ఇప్పుడు తన తదుపరి సినిమాతో మంచి విజయాన్ని అందుకునే విధంగా రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఖుషి అనే ఓ ప్రేమ కథ సినిమాను ఇప్పటికే మొదలు పెట్టాడు. కొన్ని రోజులు కాశ్మీర్లో సినిమా యొక్క షూటింగ్ చేసి సినిమాను 30% పూర్తి చేశారు.

 హైదరాబాదులో కూడా కొన్ని రోజులు షూటింగ్ చేయగా ఈ సినిమా యొక్క తదుపరి షెడ్యూల్ త్వరలోనే మొదలు కాబోతున్న నేపథ్యంలో విజయ్ దేవరకొండ చేయబోయే తదుపరి సినిమా ఎవరితో ఉంటుందా అన్న ఆసక్తి ఆయన అభిమానులలో రోజు రోజుకు నెలకొంటుంది అని చెప్పాలి. మొన్నటి దాకా ఆయనతో సినిమా చేసే దర్శకుల జాబితా పెద్దదిగానే ఉంది. హరీష్ శంకర్ శేఖర్ కమ్ముల కొరటాల శివ రాజ్ డీకే వంటి దర్శకులు ఈ హీరోతో సినిమా చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపించినట్లుగా వార్తలు వినిపించాయి. 

అయితే వీరిలో ఎవరితో సినిమా చేస్తున్నాడు అన్న విషయమై ఇంకా క్లారిటీ రాకపోవడం నిజంగా కొంత నిరుత్సాహపరిచే విషయం అనే చెప్పాలి. ఎందుకంటే ఇతర హీరోలు వారు చేయబోయే తదుపరి ఆరు సినిమాల వరకు లైనప్ ఏర్పరచుకుంటూ పోతుంటే ఈ హీరో మాత్రం కేవలం ఒకే ఒక సినిమాతో ఉండడం అందరినీ ఆశ్చర్యపరిచే విషయం అని చెప్పాలి. ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన లైజర్ సినిమా విజయం సాధించి ఉంటే ఆయన పరిస్థితి ఇలా ఉండేది కాదని చెప్పాలి. ప్రేమ కథ సినిమాలను చేసే లవర్ బాయ్ గా ప్రేక్షకులలో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరో ఇప్పుడు మాస్ ప్రేక్షకులను ఆకర్షించే విధంగా ముందుకు వెళుతూ ఉండడం విశేషం. భవిష్యత్తులో పెద్ద హీరో అవుతాడు అని పలువురు ప్రముఖుల ప్రశంసలు అందుకున్న విజయ్ దేవరకొండ కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్త వహించి ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: